Begin typing your search above and press return to search.

హ్యాట్రిక్ ఓటమి సీట్లపైన బాబు టార్గెట్

ఓడిన సీట్లనే గెలుపు బాట పట్టిస్తే వరసగా గెలుస్తున్న సీట్లలో మెజారిటీలు అదిరిపోవాల్సిందే అని బాబు చెబుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 July 2023 5:30 PM GMT
హ్యాట్రిక్ ఓటమి సీట్లపైన బాబు టార్గెట్
X

తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారానికి దూరంగా ఉంటోంది. ఆ పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్నా కూడా ఎపుడూ బంపర్ విక్టరీకి చేరువ కాలేకపోతోంది. మ్యాజిక్ ఫిగర్ కి పది పదిహేను సీట్లు మాత్రమే ఎందుకు టీడీపీకి వస్తున్నాయి. ఈ విషయంలోనే ఆ పార్టీ తర్జన భర్జన పడుతూ వస్తోంది. ఒక విధంగా టీడీపీ చూస్తే ప్లాన్ మారింది . గతంలో వరసబెట్టి ఓడిన సీట్లలో ఈసారి గెలిచి బోణీ కొట్టాలని డిసైడ్ అయింది.

దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మూడు సార్లు ఓడిన చోట ప్రత్యర్ధులు గెలిచిన చోట వారికి యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది. అలాగే టీడీపీ పట్ల సానుభూతి ఉంటుంది. మంచి క్యాండిడేట్ ని పెడితే కచ్చితంగా గెలవవచ్చు అనేది ఒకటి. రెండవది ఎపుడూ టీడీపీ గెలిచే సీట్లకు ఇవి అదనంగా కలిస్తే 2019లో వైసీపీ సాధించిన ఫీట్ అయిన బంపర్ విక్టరీని తామూ కొట్టవచ్చు అన్నది. ఇక పార్టీలో చైతన్యం తేవడం.

ఓడిన సీట్లనే గెలుపు బాట పట్టిస్తే వరసగా గెలుస్తున్న సీట్లలో మెజారిటీలు అదిరిపోవాల్సిందే అని బాబు చెబుతూ వస్తున్నారు. ఇక టీడీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా కొంత బలంగానే ఉంది. 2019 ఎన్నికల్లో ఎంత చెడ్డా పన్నెండు సీట్ల్కు గనూ నాలుగు గెలుచుకుంది. ఇపుడు ఆ నాలుగూ నిలబెట్టుకోవడంతో పాటు 2009 నుంచి ఓడుతూ వస్తున్న మూడు సీట్ల మీద టీడీపీ కన్నేసింది అని అంటున్నారు.

ఆ సీట్లే మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చేశారు. అక్కడే ఆ మధ్య మకాం వేసి తన పుట్టిన రోజు జరుపుకున్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీకి కందుల నారాయణరెడ్డికి ఇక్కడ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈ సీటుని 2009లో టీడీపీ గెలిచింది. 2014, 2019లలో ఓడింది. ఈసారి గెలవాల్సిందే అని బాబు పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు.

అలాగే ఎర్రగొండపాలెం సీటు లో 2009 నుంచి టీడీపీ ఓడుతూనే వస్తోంది. 2009లో ఆదిమూలం సురేష్ కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2014లో పాలపర్తి డేవిడ్ రాజు వైసీపీ నుంచి గెలిచారు. 2019లో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ గెలిచారు ఇక్కడ నుంచి టీడీపీ 2014 ఎన్నికల కోసం ఎరిక్షన్ బాబు పేరుని అధికారికంగా ఖరారు చేసింది అని అంటున్నారు. ఇక గిద్దలూరు సీటులో చూస్తే 2009 నుంచి టీడీపీ ఓడుతూనే ఉంది.

ఈ సీటులో 2009లో ప్రజారాజ్యం గెలిస్తే 2014, 2019లలో వైసీపీ గెలుచుకుంది. ఈ సీటులో 2024లో టీడీపీ తరఫున ముత్తముల అశోక్ రెడ్డి పేరుని టీడీపీ ఖరారు చేసింది. అంతే కాదు ఈ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తామని బాబు అంటున్నారు. మరి టీడీపీ వ్యూహాలు ఫలిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.