Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీకి షాకిస్తున్న బాబు...వైసీపీ వెల్ కం...?

అయితే కేశినేని నానికి టీడీపీ ఆశలు అయితే లేవు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   28 July 2023 2:30 PM GMT
టీడీపీ ఎంపీకి  షాకిస్తున్న బాబు...వైసీపీ వెల్ కం...?
X

విజయవాడ రాజకీయం ఆసక్తిని కలిగిస్తోంది. రెండు సార్లు విజయవాడ నుంచి ఎంపీగా టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నానికి ఈసారి టీడీపీ హ్యాండ్ ఇచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేశినేని నాని తమ్ముడు కేశినేని చిన్ని వైపు టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు.

కేశినేని నాని రెండవసారి గెలిచిన తరువాత పార్టీకి దూరం జరిగారని ప్రచారంలో ఉంది. ఆయనకు టీడీపీ అధినాయకత్వానికి మధ్య బిగ్ గ్యాప్ అయితే ఏర్పడిపోయింది. నాని ఎంపీగా ఉండగానే ఆయన తమ్ముడు చిన్నిని తెచ్చి ప్రోత్సహిస్తున్నారు. టీడీపీ నాయకులు అంతా కూడా ఆయనకు పెద్ద పీట వేస్తున్నారు.

నాని సైతం తన కార్యక్రమాలను చేసుకుంటూ జోరు పెంచేస్తున్నారు. అయితే చిన్నికి టికెట్ ఇస్తే మాత్రం తాను రంగంలో ఉంటానని ఇండిపెండెంట్ గా అయినా సరే అంటూ ఆ మధ్య కేశినేని నాని హెచ్చరించారు అది టీడీపీ హై కమాండ్ కి ఆయన చేసిన హెచ్చరికగానే చూడాలి. కానీ నాని మాటలను హై కమాండ్ పట్టించుకోవడంలేదు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేశినేని నానికి టీడీపీ టికెట్ దక్కపోతే ఆయనను తమ వైపునకు తిప్పుకునేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో కూడా బెజవాడ ఎంపీ సీటుని వైసీపీ కోల్పోయింది. ఈసారి ఎలాగైనా ఆ సీటుని దక్కించుకోవాలని చూస్తోంది.

విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పొట్లూరి వర ప్రసాద్ ఉరఫ్ పీవీపీ ఇపుడు వైసీపీతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు దాంతో వైసీపీకి ఇక్కడ అభ్యర్ధి కావాల్సి ఉంది. కేశినేని నానికి పట్టు ఉంది పైగా ఆయన రెండు సార్లు గెలిచి ఉన్నారు దాంతో ఆయనని వైసీపీలోకి ఆహ్వానించి పోటీ చేయించాలని చూస్తోంది.

ఇదే విషయం మీద ఆ మధ్య వైసీపీ నేత అయోధ్యా రామిరెడ్డి కూడా కీలక ప్రకటన చేసారు. కేశినేని నాని వస్తే వైసీపీలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అంటే వైసీపీ వైపు నుంచి రాయబేరాలు స్టార్ట్ అయ్యాయన్న మాట.

అయితే కేశినేని నానికి టీడీపీ ఆశలు అయితే లేవు అని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఆయన సోదరుడికి ఈసారి టికెట్ ఖాయమని కూడా అంటున్నారు. దాంతో ఇక డెసిషన్ తీసుకోవాల్సింది నాని మాత్రమే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఎడెనిమిది నెలల సమయం ఉంది కాబట్టి నాని ఈలోగా ఆలోచించుకుని తన కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని అంటున్నారు.

ఏది ఏమైనా విజయవాడ ఎంపీ సీటు మరోసారి హీటెక్కించేలా ఉంది అని అంటున్నారు. ఈసారి కేశినేని నాని వైసీపీ నుంచి పోటీ చేస్తే కనుక అన్నదమ్ముల సవాల్ విజయవాడలో చోటు చేసుకోవడం ఖాయం అంటున్నారు. ఇక కేశినేని నాని వైసీపీలోకి వస్తారా లేక రాజకీయంగా రిటైర్మెంట్ ప్రకటించేసి సైలెంట్ గా ఊరుకుంటారా అన్నది చూడాలి. మొత్తానికి టీడీపీ తరఫున మాత్రం కేశినేని చిన్ని పోటీలో ఉండబోతున్నారు అన్నది నిజమని ప్రచారం సాగుతోంది.