Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... ఏపీ హైకోర్టుకు నారా లోకేష్!

ఇదే సమయంలో లోకేష్ ను అక్టోబర్ 4వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని తెలుపుతూ... ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేసించింది

By:  Tupaki Desk   |   3 Oct 2023 9:12 AM GMT
బ్రేకింగ్... ఏపీ హైకోర్టుకు నారా లోకేష్!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో లోకేష్ ను ఏ14గా చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. దీనిపై లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

ఇదే సమయంలో లోకేష్ ను అక్టోబర్ 4వ తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని తెలుపుతూ... ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేసించింది. దీంతో నారా లోకేష్ ను ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీసులో కలిసిన సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చారు. అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా... హెరిటేజ్ కు సంబంధించిన బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, ఆర్ధిక పరమైన విషయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను విచారణకు వచ్చేటప్పుడు వెంట తీసుకురావాలని కోరారు! దీంతో ఈ విషయాలపై తాజాగా ఏపీ హైకోర్టులో చేశారు లోకేష్. దీంతో ఈ పిటిషన్ పై విచారణ ఈ రోజు మధ్యాహ్నం జరిగే అవకాశం ఉంది.

అవును... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనకు ఏపీ సీఐడీ అధికారులు 41ఏ కింద నోటీసులను సైతం జారీ చేశారు. ఈ సమయంలో ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన నోటీసులపై నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో భాగంగా... తనకు 41ఏ నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నారా లోకేష్... ఆ నోటీసుల్లో పొందుపరిచిన నిబంధనలను, అంశాలను తప్పుపట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న తీర్మానాలు, అకౌంట్ వివరాలను అందజేయాల్సి ఉంటుందంటూ సీఐడీ అధికారులు తనను ఆదేశించడం సరికాదని నారా లోకేష్ పేర్కొన్నారు! ఈ రోజు మధ్యాహ్నం ఈ పిటిషన్ పై విచారణ జరగనుందని తెలుస్తుంది.