జిప్పర్‌లెస్ బ్యాగ్‌ లో జీపీఎస్ డివైజ్!

Update: 2015-07-18 10:25 GMT
బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు, ట్రైన్స్ లో వెళుతున్నప్పుడు లగేజ్ తీసుకెళ్లడం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి! ఎవరైనా దొంగిలిస్తారేమో, మరెవరైనా ఓపెన్ చేసేస్తారేమో, ఒకసారి ఎక్కడపెట్టామో మరిచిపోతే ఇంక దొరకడం చాలా కష్టం! కానీ... ఇప్పుడు ఈ సమస్యలు అన్నింటికీ ఒకటే పరిష్కారం దొరికినట్లైంది! అదే జిప్పర్ లెస్ బ్యాగ్ గా తయారుచేయబడ్డ ట్రంక్ స్టర్ బ్యాగ్స్!

నిశింతగా బట్టలు, గాడ్జెట్లు, ఇలా ఏమైనా సరే సౌకర్యంగా అమరిపోయే బ్యాగులు తయారుచేయబడ్డాయి! వీటిని ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్ లేదా బస్ స్టేషన్‌ లో ఎక్కడ మరిచిపోయినా, మిస్సయినా ఎంతో సులువుగా గుర్తించవచ్చు! వర్షంలో తడిచినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు! ఈ సూట్ కేసులో ఇన్ బిల్ట్ డిజిటల్ సిస్టం ఉండటంతో చాలా అప్ డేటెడ్ సదుపాయాలు కలిగి ఉంది! కౌంటర్స్ వద్ద ఎక్స్‌ట్రా వెయిట్‌ ఉంటే... ఇది ఏమాత్రం ఆస్కారం కల్పించదు! యూఎస్బీ చార్జర్, జీపీఎస్ కనెక్షన్ కలిగి ఉండటం వల్ల ఎక్కడ పోగొట్టూకున్నా సులువుగా గుర్తించవచ్చు! వీటిని వల్ల బ్యాగ్ ఎక్కడ పోగొట్టుకున్నా సులభంగా తెలుసుకోవచ్చు! మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న సూట్ కేస్ / బ్యాగ్స్ వెల రూ.20,630 నుండి రూ. 22,300 వరకూ ఉంటుంది!
Tags:    

Similar News