ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషిన్...

Update: 2015-08-01 10:19 GMT
వాషింగ్ మెషిన్స్, ఫ్రిజ్స్ లు ఎంత పెద్దవిగా ఉంటే అంత గొప్ప అనే స్థాయిలో ఉంటుంది చాలా మంది ఆలోచన! ఇదే సమయంలో అవి ప్లాస్టిక్ వా, ఐరన్ తో చేసిన పాలిష్ బాడీ కలిగి ఉన్నవా అనేది కూడా అతి ప్రాముఖ్యమైన విషయం అయిపోయింది! దీంతో నార్మల్, సెమీ ఆటోమెటిక్, ఫుల్లీ ఆటోమెటిక్ సౌలభ్యాలతో ధరల్లోని వ్యత్యాసాలతో రకరకాల వాషింగ్ మెషిన్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి!

టెక్నాలజీ విషయంలో రొటీన్ కి భిన్నంగా ఆలోచించే దేశాల్లో ఒకటైన చైనా... ఇదే ఆలోచనా విధానంతో ప్రపంచంలోని అతి చిన్న వాషింగ్ మెషిన్ ని తయారుచేసింది! దీనికోసం ప్రముఖ ఎలక్ట్రిక్ వస్తువుల తయారీ సంస్థ "హేర్" పూనుకుంది! అనుకున్నదే తడవుగా పనిపూర్తి చేసింది! ఎంతో ప్రత్యేకంగా తయారుచేయబడిన ఈ చిన్ని వాషింగ్ మెషిన్ లో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి! ల్యాప్ ట్యాప్ బ్యాగు లోనూ, ఫ్యాంట్ జేబులోనూ పట్టేసైజులో దీన్ని తయారుచేశారు! 1 - 2 నిమిషాలలో ఎంతటి మరకనైనా ఈ మెషిన్ తొలగించేస్తుంది! ఇది దీని అతిముఖ్యమైన ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు! అయితే ఇది భారతీయ మార్కెట్ లోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది!
Tags:    

Similar News