ఈ వారం ఓటీటీలో కొత్త రిలీజులివే
ఓటీటీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆడియన్స్ ఆసక్తి కూడా రోజురోజుకీ పెరుగుతుంది. ఒకప్పుడు ఏదైనా కొత్త కంటెంట్ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిన ఆడియన్స్ కు ఓటీటీలు ఆ పనిని తప్పించేశాయి.;
ఓటీటీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆడియన్స్ ఆసక్తి కూడా రోజురోజుకీ పెరుగుతుంది. ఒకప్పుడు ఏదైనా కొత్త కంటెంట్ చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిన ఆడియన్స్ కు ఓటీటీలు ఆ పనిని తప్పించేశాయి. తామెక్కడుంటే అక్కడే అరచేతిలో సినిమా చూసేలా టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఓటీటీలో చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ కూడా దక్కుతుంది. ముఖ్యంగా వెబ్‌సిరీస్‌లు, డబ్బింగ్ సిరీస్‌లకు ఆడియన్స్ మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి వచ్చేశాయి. అవేంటో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
అన్‌ట్యామ్డ్ అనే హాలీవుడ్ టెలివిజన్ సిరీస్
అమీ బ్రాడ్లీ ఈజ్ మిస్సింగ్ అనే సిరీస్
విర్ దాస్: ఫూల్ వాల్యూమ్ అనే షో
వాల్ టు వాల్ అనే మూవీ
టు కిల్ ఎ మంకీ అనే నైజీరియన్ సిరీస్
ఐఏఎస్ అనే సినిమా
ప్రైమ్ వీడియోలో..
ధనుష్, నాగార్జున కలయికలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర అనే బ్లాక్‌బస్టర్ మూవీ
ది సమ్మర్ ఐ టర్డ్న్ ప్రెట్టీ అనే వెబ్‌సిరీస్ సీజన్3
హాట్‌స్టార్‌లో..
స్పెషల్ ఓపీఎస్ అనే వెబ్ సిరీస్ సీజన్2
డీఎన్ఏ అనే తమిళ సినిమా
స్టార్ ట్రెక్ అనే వెబ్‌సిరీస్ సీజన్3
జీ5లో..
సంజయ్ దత్, మౌనీరాయ్, సన్నీ సింగ్‌ల భూత్నీ
సత్తమమ్ నీదియుమ్ అనే వెబ్ సిరీస్
బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి చేసిన భైరవం