తమన్నా 'ఓదెల 2'.. ఓటీటీలో వేరే లెవెల్ హిట్!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా రీసెంట్ గా ఓదెల 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-05-20 06:00 GMT

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా రీసెంట్ గా ఓదెల 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. 2022లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన ఓదెల రైల్వేస్టేష‌న్ మూవీకి సీక్వెల్‌ గా ఓదెల 2ను దర్శకుడు తేజ తెరకెక్కించారు. అప్పుడు ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు సీక్వెల్ థియేటర్స్ లో విడుదలైంది.


ఓదెల 2లో త‌మ‌న్నాతో పాటు హెబ్బా ప‌టేల్‌, వ‌శిష్ట ఎన్ సింహా, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ప్రేతాత్మ‌కు, నాగ‌సాధువుకు మ‌ధ్య పోరాటం నేప‌థ్యంలో రూపొందిన సినిమాకు సంపత్ నంది కథ అందించారు. ఏప్రిల్ 17వ తేదీన రిలీజ్ అయిన ఓదెల 2లో తమన్నా తన యాక్షన్ తో మెప్పించారు. వసూళ్ల పరంగా మాత్రం కాస్త నిరాశపరిచారు.

కానీ ఇప్పుడు ఓటీటీలో ఓదెల 2 దూసుకుపోతోంది. కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమా.. భారీ సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంటోంది. రెండు వారాల నుంచి ట్రెండింగ్ నెం.1లో ఉంది. తాజాగా ఆర్మాక్స్ మీడియో రిలీజ్ చేసిన లిస్ట్ లో ఓదెల 2 రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

దీంతో ఇప్పుడు ఓదెల సీక్వెల్ ఓటీటీలో సూపర్ హిట్ అయిందనే చెప్పాలి. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఆ రేంజ్ లో దూసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. అయితే ఓదెల 2కు కొనసాగింపుగా మరో మూవీ తీస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వర్క్స్.. బ్యాక్ గ్రౌండ్ లో జరుగుతున్నట్లు టాక్.

సినిమా స్టోరీ లైన్ ఇదే.. ఓదెల గ్రామంలో నవ వధువులను తిరుపతి (వశిష్ట) హత్యాచారం చేస్తుంటాడు. దీంతో అతడిని హత్య చేస్తుంది భార్య రాధ. ఆ తర్వాత తిరుపతి ఆత్మ.. ప్రేతాత్మగా మారుతుంది. గ్రామంలోని ప్రజలపై పగ తీర్చుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఊరిలో రెండు పెళ్లిళ్లు జరగ్గా.. వధువులను అత్యాచారం చేసి చంపేస్తుంది తిరుపతి ప్రేతాత్మ.

అప్పుడు తిరుపతి ఆత్మ.. ప్రేతాత్మగా మారిందన్న విషయం గ్రామస్థులకు తెలుస్తుంది. అప్పుడు ఓదెల గ్రామాన్ని కాపాడడానికి నాగసాధువు తమన్నా వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తిరుపతి ప్రేతాత్మ ఎంత మందిని చంపేసింది? నాగసాధువుకు తిరుపతి ప్రేతాత్మకు మధ్య పోరాటం ఎలా జరిగింది? అన్న ప్రశ్నలకు పూర్తి సమాధానాలే ఓదెల-2 మూవీ.

Tags:    

Similar News