28 రోజుల‌కే ఓటీటీలోకి వ‌చ్చేసిన క్రేజీ మూవీ

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కూలీ.;

Update: 2025-09-11 05:11 GMT

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కూలీ. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా ఆగ‌స్ట్ 14న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రిలీజ్ కు ముందే టీజ‌ర్, ట్రైల‌ర్ల ద్వారా భారీ హైప్ అందుకున్న ఈ సినిమా రిలీజయ్యాక మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందుకోలేదు. కోలీవుడ్ లో రానున్న మొద‌టి రూ.1000 కోట్ల సినిమా ఇదేన‌ని ముందు అంతా అనుకున్నారు కానీ రిలీజ్ త‌ర్వాత రిజ‌ల్ట్ మొత్తం తారుమారైంది.


కూలీతో నిరాశ ప‌రిచిన లోకేష్

క‌థ‌లో నైతిక‌త లేక‌పోవ‌డం, ర‌జినీకాంత్ మూవీస్ లో ఉండే పంచ్ డైలాగ్స్ లేక‌పోవ‌డంతో పాటూ ఈ సినిమాలో త‌గిన ఎమోష‌న్, ఎలివేష‌న్ మిస్ అయింద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. లోకేష్ నుంచి గ‌తంలో వ‌చ్చిన సినిమాలు మంచి హిట్లుగా నిలవ‌డంతో ఈ సినిమా వాటికి మించి ఉంటుంద‌ని అంద‌రూ భావించారు కానీ కూలీతో లోకేష్ అంద‌రినీ నిరాశ ప‌రిచారు.

మిక్డ్స్ టాక్ తోనే రూ.500 కోట్ల క‌లెక్ష‌న్లు

కూలీ సినిమాకు మొద‌టి షో నుంచే మిక్డ్స్ టాక్ వ‌చ్చింది. ఆ టాక్ తోనే సినిమా రూ.500 కోట్లకు పైగా గ్రాస్ ను రాబ‌ట్టి త‌మిళ‌నాడులో కొత్త రికార్డుల‌ను సృష్టించింది. అయితే త‌మిళ‌నాడులో కూలీకి మంచి కలెక్ష‌న్లు వ‌చ్చిన‌ప్ప‌టికీ తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో మాత్రం బ‌య్య‌ర్ల‌కు ఆశించిన లాభాలు ద‌క్క‌లేదు. కాగా థియేట్రిక‌ల్ ర‌న్ ముగించుకున్న కూలీ ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేసింది.

28 రోజుల‌కే ఓటీటీలోకి..

కూలీ ఓటీటీ హ‌క్కుల‌ను రిలీజ్ కు ముందే భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు సెప్టెంబ‌ర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో కూలీ స్ట్రీమింగ్ కు వ‌చ్చింది. రిలీజైన 28 రోజుల‌కే కూలీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రావ‌డంతో నెటిజ‌న్లు దాని గురించి పోస్టులు పెడుతున్నారు. థియేట‌ర్ల‌లో మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకున్న కూలీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News