ఇంట్రెస్టింగ్ మూవీలు.. క్రేజీ సిరీస్ లు.. ఈ వారం OTT లిస్ట్ ఇదే!

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి అనేక సినిమాలు, వెబ్ సిరీసులు రెడీ అయ్యాయి.;

Update: 2025-06-01 20:21 GMT

ఎప్పటిలానే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయడానికి అనేక సినిమాలు, వెబ్ సిరీసులు రెడీ అయ్యాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ మూవీలు, క్రేజీ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అలా ఈ వారం.. బోలెడు కంటెంట్ వివిధ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. అవ్వనుంది.. మరి ఆ లిస్ట్ పై ఒకసారి లుక్కేద్దాం.

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో వచ్చిన హిట్-3 మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో సందడి చేస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ దూసుకుపోతోంది. మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబోలో వచ్చిన సికందర్‌ కూడా నెట్‌ ఫ్లిక్స్‌ లోనే అందుబాటులో ఉంది.

కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్య హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ రెట్రో.. తెలుగు, తమిళం సహా ఇతర భాషల్లో నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగానే అందుబాటులోకి వచ్చింది. కోర్ట్ మూవీ కూడా అందులోనే సందడి చేస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఉన్న మిగతా సినిమాలు, సిరీస్ లు ఇవే..

ఏ విడోస్‌ గేమ్‌- ఇంగ్లీష్, స్పానిష్ మూవీ

ది హార్ట్‌ నోస్‌- ఇంగ్లీష్, స్పానిష్ మూవీ

లాస్ట్‌ ఇన్‌ ద స్టార్‌ లైట్‌- కొరియన్‌, ఇంగ్లీష్‌ మూవీ

డిపార్ట్‌ మెంట్‌ క్యూ- ఇంగ్లీష్‌, తెలుగు వెబ్‌ సిరీస్‌

మ్యాడ్‌ యూనికార్న్‌- థాయ్ వెబ్ సిరీస్

కోల్డ్‌ కేస్‌: ది టైలెనోల్‌ మర్డర్స్‌- ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ

ఎఫ్‌1: ది అకాడమీ- ఇంగ్లీష్‌ డాక్యుమెంటరీ

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చౌర్య పాఠం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక అవసరం కోసం దొంగతనం చేయాల్సి వస్తే.. హీరో ఏం పాఠం నేర్చుకుంటాడనే పాయింట్ తో వచ్చిన ఆ సినిమా ఇప్పుడు ఆకట్టుకుంటోంది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు ఇంకేం ఉన్నాయంటే..

వీర చంద్రహాస- కన్నడ సినిమా

వైలెంట్‌ వన్‌- ఇంగ్లీష్ మూవీ

వైట్‌ అవుట్‌- ఇంగ్లీష్ మూవీ

ప్లెయిన్‌- ఇంగ్లీష్‌ మూవీ

ట్రెజర్‌- ఇంగ్లీష్‌ మూవీ

ది లాస్ట్‌ స్టాప్‌ ఇన్‌ యుమ కౌంటీ- ఇంగ్లీష్‌ మూవీ

గుడ్‌ రిచ్‌- ఇంగ్లీష్ మూవీ

ది బెటర్‌ సిస్టర్‌- ఇంగ్లీష్ వెబ్‌ సిరీస్‌

జియో హాట్‌ స్టార్‌

టూరిస్ట్‌ ఫ్యామిలీ- తెలుగు మూవీ

కెప్టెన్‌ అమెరికా: బ్రేవ్‌ న్యూ వరల్డ్‌- తెలుగు, ఇంగ్లీష్‌ మూవీ

అండ్‌ జస్ట్‌ లైక్‌ దట్‌ సీజన్ 3- ఇంగ్లీష్ సిరీస్

అడాల్ట్స్‌ సీజన్ 1- ఇంగ్లీష్ సిరీస్

ఆహాలో డెమన్‌- తెలుగు మూవీ, నిజర్‌ కుడాయ్‌- తమిళ్‌ చిత్రం, వానిల్‌ తెండియన్‌- తమిళ్‌ మూవీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అదే సమయంలో జీ5లో కన్నడ సినిమాలు ఇంటరాగేషన్, అజ్ఞాతవాసి అందుబాటులో ఉన్నాయి. సోనీ లివ్ లో హిందీ, తెలుగు వెబ్ సిరీస్ కంఖజుర స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీరు ఏది చూస్తారు?

Tags:    

Similar News