ఓటీటీ మ్యాజిక్ కోసం నితిన్ వెయిటింగ్!
యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల నేపథ్యంలో లేటెస్ట్ రిలీజ్ 'తమ్ముడి'పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఫలితం కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది.;
యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల నేపథ్యంలో లేటెస్ట్ రిలీజ్ 'తమ్ముడి'పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఫలితం కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. 'తమ్ముడు' తో కంబ్యాక్ అవ్వాలనుకున్న నితిన్ ఆశ మరోసారి నిరు కారింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్ ప్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్ట్రీమింగ్ తేదీపై ప్రకటనలు కూడా వస్తున్నాయి. ఆగస్టు 1 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.తెలుగు సహా తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
మరి ఓటీటీలో అయినా తమ్ముడు మ్యాజిక్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. థియేట్రికల్ గా ఆడని చాలా సినిమాలు ఓటీటీలో మంచి ఆదరణకు నోచుకున్న సందర్భాలున్నాయి. గతంలో థియేటర్లో ఫెయిలైన సినిమాలు టీవీలో మంచి టీఆర్పీ సాధించినట్లు ఓటీటీ అందుబాటులోకి వచ్చాక సీన్ మారింది. థియేటర్ ఆడియన్స్ ని మెప్పించని సినిమాలు ఓటీటీ ఆడియన్స్ ని అలరించి ప్రశంలందుకున్న సందర్భా లున్నాయి. 'అతడు', 'ఖలేజా' సినిమాలు థియేటర్ కంటే అప్పట్లో టెలివిజన్ స్ట్రీమీంగ్ లో రికార్డులే నమెదు చేసాయి.
బుల్లి తెరపై ఆ రేంజ్ రెస్పాన్స్ మేకర్స్ కూడా ఊహించలేదు. అందుకే ఇప్పుడు 'అతడు' చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఓటీటీలో కూడా ఇలాంటి సక్సస్ లు ఎన్నో. మరి 'తమ్ముడు' ఓటీటీ ఆడియన్స్ ని అయినా అలరించి గట్టెక్కుతుందా? థియేటర్ రిలీజ్ తరహా ఫలితాలు సాధిస్తుందా? అన్నది చూడాలి. ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్నది ఒకే ఒక్క సినిమా. అదే ఎల్లమ్మ. 'బలగం' ఫేం వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. నితిన్ కెరీర్ మొదలైంది రాజు గారు నిర్మించిన 'దిల్' సినిమాతోనే . ఆ సినిమాతో నితిన్ కి హిట్ ఇచ్చి పెద్ద స్టార్ ని చేసారు రాజుగారు. నితిన్ వైఫల్యాల్లో ఉన్న నేపథ్యంలో చేస్తోన్న చిత్రం కూడా 'ఎల్లమ్మ`. ఈ సినిమాతో నితిన్ కెరీర్ ని మళ్లీ పట్టాలెక్కించాల్సిన బాధ్యత రాజుగారిపై ఉంది.