తెలుగు ఆటగాడిపై హార్ధిక్ పాండ్యా అసహనం... తీవ్ర వ్యాఖ్యలు!

ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ పేళవమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-28 11:18 GMT

ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ పేళవమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆడిన 9 మ్యాచ్ లలోనూ మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. దీంతో... ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో టీంపై ఫైరవుతున్నారు. ప్రధానంగా హార్ధిక్ పాండ్యాని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే హార్థిక్ మాత్రం.. ఓటమికి కారకుడంటూ.. మరో ప్లేయర్ పై తాజాగా విమర్శలు చేశారు.

అవును... ఐపీఎల్-2024 సీజన్‌ లో పరుగుల వరద కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అరుణ్‌ ‌ జైట్లీ స్టేడియంలో 504 పరుగులు నమోదైన మ్యాచ్‌ లో ముంబై ఇండియన్స్‌ పై ఢిల్లీ క్యాపిటల్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.

ఢిల్లీ బ్యాటర్స్ లో ఓపెనర్ జేక్ ఫ్రేజర్ మెక్‌ గుర్క్ (84: 27 బంతుల్లో, 11x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించడం గమనార్హం. ఇదే క్రమంలో... ట్రిస్టన్ స్టబ్స్ (48*: 25 బంతుల్లో, 6x4, 2x6), షై హోప్ (41: 17 బంతుల్లో, 5x6) సత్తాచాటారు.. ఢిల్లీ బౌలర్లను చెండాడారు!

Read more!

అనంతరం చేజింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్స్ లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4x4, 4x6) అద్భుతంగా పోరాడాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (46; 24 బంతుల్లో, 4x4, 3x6), టిమ్ డేవిడ్ (37: 17 బంతుల్లో, 2x4, 3x6) మెరిశారు.

ఆ సంగతి అలా ఉంటే... మ్యాచ్ అనంతరం మైకు ముందుకు వచ్చిన పాండ్యా... ఓటమికి గల కారణాలు వివరించాడు. ఈ సమయంలో... జేక్ ఫ్రేజర్ అద్భుతంగా ఆడాడని చెబుతూ.. మిడిల్ ఓవర్లలో కాస్త మెరుగ్గా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు!

ఇందులో భాగంగా.. 8వ ఓవర్ లో అక్షర్ పటేల్ బౌలింగ్ కి వచ్చినప్పుడు.. ఎడమ చేతి బ్యాట్స్ మెన్ అయిన తిలక్ వర్మ ఆ ఓవర్లో దూకుడుగా ఆడాల్సిందని.. కానీ, అతడు మాత్రం తొలి 4 బంతుల్లో నాలుగు సింగిల్స్ మాత్రమే తీశాడని.. అక్కడే మ్యాచ్ పోయిందని పేర్కొన్నాడు! నెట్టింట చాలా మంది ముంబై ఫ్యాన్స్ తో విమర్శలు ఎదుర్కొంటున్న పాండ్యా... ఈ సీజన్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న తిలక్ వర్మపై ఇలా వ్యాఖ్యానించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Tags:    

Similar News