హార్డ్‌వర్క్ అంటే ఇదే.. పాండ్యా కార్ కలెక్షన్ వెనుక అసలు కథ!
గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన హార్దిక్ పాండ్యా బ్యాక్‌గ్రౌండ్ చాలా సాధారణమైనది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంటే ఈరోజు తెలియని వారంటూ లేరు. గ్రౌండ్‌లో పవర్‌ఫుల్ సిక్సర్లు కొట్టడమే కాదు.. రియల్ లైఫ్‌లోనూ అంతే లగ్జరీగా బ్రతకడం పాండ్యా స్టైల్. ఒకప్పుడు సరైన ప్రయాణ సౌకర్యాలు లేక, కనీసం తిండికి కూడా ఇబ్బంది పడిన ఈ క్రికెటర్, ఈరోజు ఇండియన్ క్రికెట్‌లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కార్ కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నాడు. లగ్జరీ కార్లంటే అతనికి పిచ్చి, హార్దిక్ గ్యారేజ్‌లో కోట్లాది రూపాయల విలువైన సూపర్ కార్లు ఉన్నాయి. ఇక కఠిన శ్రమ, సెల్ఫ్ బిలీఫ్‌తో అతను సాధించిన ఈ ఎదుగుదల నిజంగా ప్రతి ఒక్కరికీ ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. ఆ వివరాలు చూద్దాం..
సున్నా నుండి మొదలైన ప్రయాణం:
గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించిన హార్దిక్ పాండ్యా బ్యాక్‌గ్రౌండ్ చాలా సాధారణమైనది. తండ్రికి ఉన్న చిన్న ఉద్యోగం పోవడంతో వాళ్ల ఫ్యామిలీ బరోడాకు మారాల్సి వచ్చింది. అక్కడ అన్న కృనాల్ పాండ్యాతో కలిసి కిరణ్ మోరే అకాడమీలో క్రికెట్ నేర్చుకున్నాడు. ఇక ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. ఒక్కోసారి కేవలం మ్యాగీ నూడుల్స్ తిని కూడా రోజంతా ప్రాక్టీస్ చేసిన రోజులు ఉన్నాయి. కానీ క్రికెట్ మీదున్న ప్యాషన్‌తో ఇద్దరు అన్నదమ్ములు కష్టపడి రాటుదేలారు.
కోట్లాది రూపాయల ఫెరారీ, రోల్స్ రాయిస్:
ఇక అలాంటి కష్టాల నుండి వచ్చిన హార్దిక్.. ఈరోజు ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా ఎదిగి, తన గ్యారేజ్‌ను ఖరీదైన కార్లతో నింపేశాడు. అతని కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది దాదాపు రూ.12 కోట్ల విలువైన ఫెరారీ 12 సిలిండ్రి. దీంతో పాటు లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన రూ.9 కోట్ల రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు కూడా హార్దిక్ సొంతం.
గ్యారేజ్‌లో లంబోర్గిని, రేంజ్ రోవర్స్:
స్పీడ్ మరియు పవర్‌ఫుల్ కార్లంటే ఇష్టపడే పాండ్యా దగ్గర రూ.4.1 కోట్ల విలువైన 'లంబోర్గిని హురాకాన్ ఈవో' స్పోర్ట్స్ కార్ ఉంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ గా వెళ్లడం కోసం రూ.4.2 కోట్ల 'రేంజ్ రోవర్ వోగ్', రూ.2.95 కోట్ల 'రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వి' కార్లను వాడుతుంటాడు.
మెర్సిడెస్ జి-వ్యాగన్, పోర్షే:
సెలబ్రిటీల ఫేవరెట్ కార్ అయిన 'మెర్సిడెస్ ఏఎమ్‌జీ జి63' జి-వ్యాగన్ కూడా పాండ్యా కార్ల లిస్ట్‌లో ఉంది, దీని విలువ రూ.3.6 కోట్లు. అలాగే ఇక రూ.2.6 కోట్ల విలువైన 'పోర్షే కయెన్' లగ్జరీ ఎస్‌యూవీ కూడా అతని గ్యారేజ్‌లో చోటు చేసుకుంది.
రోజువారీ వాడకం కోసం నార్మల్ కార్లు:
భారీ బడ్జెట్ సూపర్ కార్లతో పాటు హార్దిక్ దగ్గర కొన్ని నార్మల్ కార్లు కూడా ఉన్నాయి. రూ.61 లక్షల 'ఆడి ఏ6' సెడాన్, రూ.17 లక్షల 'జీప్ కంపాస్' మరియు దాదాపు రూ.9 లక్షల విలువైన 'టొయోటా ఎటియోస్' కార్లు కూడా ఉన్నాయి. ఇక ఒకప్పుడు కార్ కొనడమే కల అనుకున్న వ్యక్తి.. ఈరోజు ఇన్ని బ్రాండెడ్ కార్లను మెయింటైన్ చేస్తున్నాడు అంటే దాని వెనుక ఎంతో కష్టం దాగివుంది అన్నది నిజం.
ఒకప్పుడు గ్రౌండ్‌కు వెళ్లడానికి సరైన బండి లేని స్థితి నుండి.. ఈరోజు వందల కోట్ల విలువైన కార్ల కలెక్షన్ సొంతం చేసుకునే స్థాయికి హార్దిక్ పాండ్యా ఎదిగాడంటే, దానికి కారణం అతని హార్డ్‌వర్క్ మాత్రమే. ఇక జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నమ్మిన కల కోసం కష్టపడితే సక్సెస్ ఎలా వరిస్తుందో చెప్పడానికి హార్దిక్ పాండ్యా లైఫే ఒక బెస్ట్ ఇన్‌స్పిరేషన్.