ఈ ఫోటోలు ఉన్న సెలబ్రెటీ ఎవరు!

Update: 2015-07-20 05:25 GMT
ఒక మనిషి జీవితంలో ఎంత గొప్పవాడైనా... చిన్నప్పటి సంఘటనలు, సంగతులు, వాటి తాలూకు ఫోటోలు తీపిగురుతులు! సామాన్యులు వీటిని ఇంటికి వచ్చిన చుట్టాలకు చూపించి మురిసిపోతారు, తమలో తాము చూసి సంబరపడిపోతారు! ఆ ఫోటోలు, ఆ సంఘటనలు సెలబ్రెటీలవి అయితే... అవి కచ్చితంగా ప్రపంచం తెలుసుకోవాలని అనుకుంటుంది!

ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలో ఒక చిట్టి బాబు... తన తల్లి ఒడిలో ఉండి ల్యాండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు. స్మార్ట్ లుక్ తో సైడ్ కి చూస్తూ ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా! ఈ చిట్టి కుర్రాడు ఈ ఫోటోను తన ఫేస్ బుక్ లో షేర్ చేసాడు. ఇతడు ఒక క్రికెటర్ అని క్లూ ఇస్తే కనుక్కోగలరా? సరే అయితే... ఆ క్రికెటర్ పేరున ఉన్న రికార్డులు, అతని కెరీర్ గ్రాఫ్ తెలుసుకుందాం! అప్పుడైతే సులువుగా గుర్తించేస్తారు!

ఇతని క్రికెట్ జీవితం సుమారు 16 ఏళ్లు. 164 టెస్టులు ఆడిన అనుభవం ఆ టెస్టుల్లో 13288 పరుగులు సాధించాడు! ఇందులో 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు ఉన్నాయి! ఇక వండేల విషయానికి వస్తే... 344 మ్యాచ్ లు 10882 పరుగులు వాటిలో 12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలు ఉన్నాయి! క్రికెట్ పుస్తకంలో ఉన్న ప్రతీ షాట్ ఆడగల ఏకైక క్రికెటర్ అని చెప్పినా ఆశ్చర్యం కాదు! ఇప్పటికే అర్ధం అయిపోయింది కదా... అతడే ది వాల్, నమ్మకమైన క్రికెటర్... రాహుల్ ద్రావిడ్!
Tags:    

Similar News