అద్భుతం.. సగం జనాభా వైసీపీవైపే..

Update: 2019-05-24 10:27 GMT
ఆద్భుతం.. ఏపీలో దాదాపు సగం జనాభా వైసీపీకి సపోర్టుగా నిలిచారు. ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో 50శాతం ప్రజలు ఒక పార్టీకి మద్దతు ఇచ్చిన సందర్భాలు చాలా తక్కువ. 40 నుంచి 45 దాటితే అది ప్రభంజనమే.. కానీ  2019 ఎన్నికల వేళ వైసీపీ ఈ అపూర్వ విజయాన్ని సాధించింది.

తాజాగా ఎన్నికల కమిషన్ ఏపీలో కౌంటింగ్ పూర్తయ్యాక ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనే దానిపై వివరాలను వెల్లడించింది. అందులో ఆశ్చర్యకరంగా వైసీపీకి 50శాతం మంది ఓటేయడం విశేషం.

ఏపీలో మొత్తం 175 సీట్లు ఉన్న అసెంబ్లీలో  వైసీపీ 151 సీట్లు గెలిచి సంచలనం సృష్టించింది. వైసీపీ ఏకంగా 49.95శాతం ఓట్లను (1,56,83,592)లను చేజిక్కించుకోవడం విశేషం. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు 39.18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ కంటే 10శాతం అత్యధికంగా వైసీపీ ఓట్ల శాతం సాధించడం విశేషం.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన కేవలం 6.8 ఓట్ల షేర్ తో 2130367 ఓట్లను మాత్రమే సాధించడం అందరినీ షాక్ కు గురిచేసింది.బీఎస్పీ సీపీఐ, సీపీఎం ఇంకా తక్కువే ఓటింగ్ శాతాన్ని సాధించాయి.

ఇక 2014లో చూసుకుంటే టీడీపీ-బీజేపీ కూటమి 46.79శాతం ఓట్ల శాతం పొంది 106 సీట్లు సాధించింది. ఇక ప్రతిపక్ష వైసీపీ 44.58శాతం ఓట్లతో 67 స్థానాలు సాధించింది. ఈ రెండు పార్టీల మధ్య తేడా కేవలం 2.21శాతం కావడం గమనార్హం.

అయితే అనూహ్యంగా 50శాతం ఓట్ల శాతంతో ఏకంగా 22 ఎంపీ సీట్లను సాధించగా.. 39.59శాతం ఓట్లతో టీడీపీ 3 సీట్లనే గెలవడం షాక్ కు గురిచేసింది. ఇక నోటాకు ఈ ఎన్నికల్లో 1.49శాతం ఓట్ల శాతం రావడం విశేషం.

    

Tags:    

Similar News