ఇలాంటి పెళ్లి ఫోటోను మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు

Update: 2020-12-11 04:35 GMT
నిజంగానే నిజం.. ఇలాంటి పెళ్లి ఫోటోను మీరు చూసి ఉండకపోవచ్చు. అరుదైన కాంబినేషన్ మాత్రమే కాదు.. చాలా రేర్ గా ఇలాంటి కాంబినేషన్ గురించి వింటామేమో. ఈ ఫోటోలో కనిపిస్తున్న రెండు జంటల్ని చూసినంతనే సమ్ థింగ్ స్పెషల్ గా అనిపించక మానరు. అవును.. మీ అంచనా కరెక్టే. ఒకే పోలికతో ఒక కవలలు.. తమలాంటి ఒకే పోలికతో ఉన్న మరో జంటతో మ్యాచ్ కావటం.. వారి పెళ్ల ధూంధాంగా జరగటం ఆసక్తికరమని చెప్పాలి.

కవల సోదరులు.. కవల సోదరీమణులు కలిసి ఒకే వేదిక మీద జరిగిన ఈ పెళ్లి రోటీన్ కు భిన్నమైనదిగా చెప్పాలి. ఈ స్పెషల్ పెళ్లికి మహబూబాబాద్ జిల్లా వేదికైంది. జిల్లాకు చెందిన వెంకటగిరి గ్రామానికి చెందిన మహేశ్.. నరేశ్ లు ఇద్దరు కవలలు. వారి పెళ్లి తాజాగాహైదరాబాద్ కు చెందిన శాంతి.. హిమజ అనే ఇద్దరు కవలల సోదరీమణులతో కుదిరింది. ఈ రెండు పెళ్లిళ్లను ఒకే వేదికమీద నిర్వహించారు.

ఈ కవలల జంట పెళ్లిళ్లను ఒకే వేదిక మీద.. ఒకే సమయంలో జరిగాయి. ఈ పెళ్లికి వచ్చిన వారంతా చూడచక్కటి ఈ జంటను చూసి సంతోషంతో ఆశీర్వదించారు. ఇప్పుడు చెప్పండి. ఇలాంటి పెళ్లి ఫోటోను మీరు ఇప్పటివరకు ఎప్పుడైనా చూశారా?
Tags:    

Similar News