కరోనా మరణమృదంగం ...ఈమె చేసిన త్యాగం ఎంత గొప్పదంటే ..!
కరోనా వైరస్ ప్రపంచంలోని మెజారిటీ దేశాలలో మరణమృదంగం సృష్టిస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తరువాత ప్రపంచాన్ని చుట్టుముట్టి అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ మహమ్మారి కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో వేలమంది ప్రాణాలు కోల్పోగా, లక్షలమంది ఈ వైరస్ బారిన పడ్డారు. అయితే ఇంతటి మహా విలయంలో ఒక పెద్దావిడ ఎవరు చేయని త్యాగం చేశారు. వైరసె సోకి ఆరోగ్యం విషమించిన పరిస్థితుల్లో కూడా తనకు వెంటిలేటర్ వద్దని,వెంటిలేటర్ పెట్టుకోవడానికి నిరాకరించారు. తనకు బదులుగా తనకంటే వయసులో చిన్న వారికి దాన్ని ఉపయోగించమని చెప్పారు. చివరకు, కరోనా కారణంగా ఆ తరువాత కన్నుమూశారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. బెల్జియంకు చెందిన సుజాన్ హోయలార్ట్స్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. వ్యాధి ముదరడంతో ఆకలి మందగించడంతోపాటు, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో ఆమెకు వెంటిలేటర్ అమర్చేందుకు వైద్యులు సిద్ధపడ్డారు. ఇక్కడే ఆమె పెద్దమనసును చాటుకున్నారు. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఆమె తనకు కృత్రిమ శ్వాసక్రియను ఉపయోగించడం ఇష్టం లేదనీ, ఇప్పటికే చాలా మంచి జీవితాన్ని గడిపాను కనుక తనకు ఉపయోగించే ఆ పరికరాన్ని వేరే ఎవరైనా చిన్న వయసున్న రోగులకు ఉపయోగించండి అని వైద్యులతో చెప్పారు. దురదృష్టవశాత్తు ఆ తరువాత కొన్ని రోజులకే ఆమె కన్నుమూశారు.
దీనితో ఆమె త్యాగం మరువలేనిదంటూ ఆమెకు చికిత్స అందించిన వైద్యులు సహా పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కాగా కరోనా వైరస్ కారణంగా పంచవ్యాప్తంగా ప్రస్తుతం 8,61,113పాజిటివ్ కేసులు నమోదు కాగా, 42,385 మంది మృతి చెందారు. ఈ మహమ్మారికి కచ్చితమైన మందు, వ్యాక్సిన్ ఏదీ అందుబాటులో రాకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.