అమెరికా నివేదిక..హిందుత్వ వాదుల సీరియస్

Update: 2018-06-16 12:13 GMT
అమెరికన్ నిఘా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పరిణామాలను అధ్యయనం చేసి ‘వరల్డ్ ఫ్యాక్ట్ బుక్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది.  ఈ నివేదిక ఇప్పుడు భారత్ లో దుమారం రేపుతోంది. ఈ నివేదికలో విశ్వహిందూ పరిషత్ - భజరంగ్ దళ్ సంస్థలను హిందూ ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ తేల్చింది. ఇవి అత్యంత ప్రమాదకరమైన హిందూ భావజాలంతో కూడిన రాజకీయాలు చేస్తుంటాయని సీఐఏ అభిప్రాయపడింది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వాటి మద్తతుతో ఏర్పడిన ప్రభుత్వాలపై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంటాయని సీఐఏ తెలిపింది.

2014లో బీజేపీ గద్దెనెక్కాక భారతదేశంలో హిందూయిజం పెరిగిపోయింది. హిందుత్వ వాదులు దళితులు - ముస్లిం మైనార్టీలపై మతం పేరుతో దాడులు చేస్తూ హడలుకొడుతున్నారు. పలు హత్యలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 1 - ఫిబ్రవరి 14వంటి రోజుల్లో భజరంగ్ దళ్ నాయకులు చేసే పనులు దడ పుట్టిస్తుంటాయి. అడ్డుకోవడానికి అధికార వర్గాలున్నా ప్రభుత్వంలో బీజేపీ ఉండడంతో వారు ఏమీ అనలేని పరిస్థితి. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో గతంలోకంటే భారత్ లో హిందుత్వ ఉగ్రవాదం పెరిగిందని సీఐఏ పేర్కొనడం విశేషం.

అయితే తమను ఉగ్రవాదులుగా అమెరికా పోల్చడంపై వీహెచ్.పీ - భజరంగ్ దళ్ మండిపడుతున్నాయి. తాము ఎలా ఉగ్రవాద సంస్థలుగా కనిపించామని ఆగ్రహంతో ర్యాలీలు తీస్తున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమెరికాకు నిరసన తెలుపాలని నిర్ణయించాయి.
Tags:    

Similar News