మంచి ఫలితాన్ని ఇస్తున్న చైనా వ్యాక్సిన్ .. టాప్ టెన్ లో మూడు చైనా వ్యాక్సిన్లు !
కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అదిగో.. ఇదిగో.. అంటూ అంతా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ కోసం, పలుదేశాల్లో ట్రయల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. చైనా అభివృద్ధి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ల లో కీలకమైన సీఎన్ బీజీ వ్యాక్సిన్ పై తాజాగా నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడయ్యాయి. సీఎన్బీజీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తోందని ప్రముఖ మెడిసిన్ జర్నల్ లాన్సెట్ తన అధ్యయనం లో వెల్లడించింది.
ప్రాథమిక, మధ్యస్ధాయి మానవ పరీక్షలో వ్యాక్సిన్ డోసు తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత మెరుగైందని పేర్కొంది. సీఎన్ బీజీ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్ ప్రొడక్ట్స్ , బీబీఐబీపీ-కోర్ వీ పేరిట ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. మూడవ దశ పరీక్షల్లోకి ప్రవేశించిన ప్రపంచంలోని ప్రముఖ పది కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి కావడం గమనార్హం. డబ్ల్యూహెచ్ ఓ గణాంకాల ప్రకారం మూడవ దశ పరీక్షల్లోకి ప్రవేశించిన వ్యాక్సిన్లలో మూడు చైనా వ్యాక్సిన్‌లు ఉన్నాయి. ఇక బీబీఐబీపీ వ్యాక్సిన్ డోసును తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ లేవని సంస్థ పేర్కొంది.
బీబీఐబీపీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కొందరిలో మాత్రం జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే కనిపించాయని ఈ స్టడీ పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత పెరిగిందని సీఎన్బీజీ తెలియజేసింది. తమ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్ట్స్ బీబీఐబీపీ - కోర్ వీ పేరిట ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.