బీజేపీ నుంచి తిరుపతి బరిలో 'ఆ నలుగురు'

Update: 2021-03-13 12:35 GMT
తిరుపతి ఉప ఎన్నిక పోటీలోంచి జనసేన తప్పుకుంది. మిత్రపక్షం బీజేపీకే అవకాశం ఇచ్చింది. అధికారిక ప్రకటన రావడంతో ఇప్పుడు తిరుపతి బరిలో బీజేపీ తరుఫున ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తిరుపతి ఉప ఎన్నికలకు బిజెపి ఇప్పటికే పోటీదారుల జాబితాను సిద్ధం చేసింది. జనసేన పార్టీని పోటీ నుండి వైదొలగాలని ఒత్తిడి తెచ్చే ముందే ఈ మేరకు జాబితాను  సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

తిరుపతి నుంచి బిజెపి టికెట్ కోసం 27 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఆ జాబితాను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపినట్లు వర్గాలు తెలిపాయి. అన్ని దరఖాస్తులను పరిశీలించిన తరువాత పార్టీ నలుగురి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం.

కుదించిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు - దాసరి శ్రీనివాసులు మరియు రత్న ప్రభా (కర్ణాటక మాజీ ప్రధాన కార్యదర్శి); ఒకరు రిటైర్డ్ ఐపిఎస్ అధికారి - కృష్ణ ప్రసాద్, నాలుగో వ్యక్తి తిరుపతికే చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ముని సుబ్రహ్మణ్యం.

బిజెపి జాతీయ నాయకత్వం అభ్యర్థుల విద్యా, ఆర్థిక నేపథ్యాన్ని పరిశీలించి ఈ మేరకు నలుగురితో కలిసి చిన్న జాబితాను తయారు చేసింది.  వీరిలో ఒకరిని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయనుంది. ఎందుకంటే విద్యావంతులైన ఓటర్లు తిరుపతిలో ఎక్కువ శాతం ఉన్నారు.

అయినప్పటికీ, ముని సుబ్రహ్మణ్యం పార్టీ టికెట్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే అతను స్థానిక నాయకుడు. మరియు తిరుపతిలో అందరికీ తెలిసిన ముఖం. ఆయన రాష్ట్ర బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కూడా. మిగిలిన ముగ్గురు - దాసరి శ్రీనివాసులు, రత్న ప్రభా మరియు కృష్ణ ప్రసాద్ స్థానికేతరులు.ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన గంటల్లోనే బిజెపి నాయకత్వం పేరును ప్రకటిస్తుందని సమాచారం. మరి ఈ నలుగురిలో ఎవరు అవుతారన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News