ప్రపంచంలోనే అతిపెద్ద వైరస్ ఆసుపత్రి ...విశేషాలు !‌

Update: 2020-06-29 15:00 GMT
ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తున్న ఈ కరోనా మహమ్మారి, ఇండియాలో కూడా విజృంభిస్తుంది. మహారాష్ట్ర, ఢిల్లీలు ఈ వైరస్ హాట్‌ స్పాట్స్ ‌గా మారాయి. జూలై చివరినాటికి ఢిల్లీలో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5.5లక్షలకు చేరుకుంటాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో వైరస్ రోగులకు చికిత్స చేయడం కోసం ప్రపంచంలోనే అతి పెద్ద తాత్కాలిక కోవిడ్‌ ఆసుపత్రిని దక్షిణ ఢిల్లీలో నిర్మించారు.

ఈ హాస్పిటల్ లో ఉన్న ప్రత్యేకతలని ఒకసారి చూస్తే ...చత్తర్‌ పూర్ ‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం రాధాస్వామి సత్సంగ్‌ బియాస్‌ కాంప్లెక్స్ ‌నే ఈ తాత్కాలిక వైరస్ ఆస్పత్రిగా మార్చారు. 15 ఫుట్ ‌బాల్‌ మైదానాలతో సమానమైన ఈ ప్రత్యేక ఆస్పత్రికి ‘సర్దార్‌ పటేల్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ అండ్‌ హాస్పిటల్‌’ అని పేరు పెట్టారు. దీనిలో 10,000 పడకల సామర్థ్యం ఉంది. చైనాలో 10 రోజుల్లో నిర్మించిన వైరస్‌ ప్రత్యేక ఆసుపత్రి కన్నా ఇది పదింతలు పెద్దది కావడం గమనార్హం.

ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన వైద్య సిబ్బంది ఈ ఆసుపత్రిలో పనిచేస్తారు. దాదాపు 1000 మంది జనరల్‌ డాక్టర్లతో పాటు ఇతర సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. మొత్తం బెడ్స్‌ ని 10 విభాగాలుగా విభజిస్తారు. వీటిలో 1000 పడకలకు ఆక్సిజన్‌ పాయింట్లు అమర్చుతారు. రోగుల కోసం 5 వేల ఫ్యాన్‌ లు, 1000 మూత్రశాలలు ఏర్పాటు చేశారు. లక్షణాలు కనిపించని వైరస్ పాజిటివ్‌ రోగులకు.. తక్కువ లక్షణాలు ఉన్న వారికి ఇక్కడ చికిత్స అందిస్తారు. అయితే ఈ ఆస్పత్రిలో తొలుత 2,000 పడకలు అందుబాటులోకి రానుండగా.. జూలై 3 వరకు పూర్తి స్థాయిలో బెడ్స్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఢిల్లీ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించారు.
Tags:    

Similar News