వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలు సాధ్యమేనా?

Update: 2020-07-05 14:30 GMT
ఇది కరోనా కాలం.. కలిసి కూర్చోలేని దుస్థితి.  సభలు, సమావేశాలకు కాలం చెల్లింది.ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా వర్చ్యువల్ గా నిర్వహించవచ్చా సాధ్యమవుతుందా లేదా అన్న దానిపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది.

ప్రతి పార్లమెంట్ సమావేశానికి మధ్య కనీసం 6 నెలల వ్యవధి మించకూడదన్న నిబంధన ఉంది. మార్చి 23న బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం కరోనాతో అర్ధాంతరంగా వాయిదా వేసింది. ప్రస్తుతం వర్షకాల సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. మళ్లీ సెప్టెంబర్ 23లోపు ఖచ్చితంగా పార్లమెంట్ సమావేశమవ్వాలి.

ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. గాల్వన్ లోయలో భారత సైనికుల మరణం, చైనాతో ఘర్షణ, ఆర్థిక మందగమనంపై మోడీని నిలదీసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతుండగా.. ఎంపీలంతా 60 ఏళ్లు పైబడిన వారే కావడంతో కరోనా భయానికి తాము ఢీల్లీకి రాలేమంటూ మొండికేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వర్చ్యువల్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలిపేందుకు ‘నేషనల్ ఇన్ఫార్మాటిక్స్’ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 542 లోక్ సభ ఎంపీలు, 242 మంది రాజ్యసభ ఎంపీలతో ఈ సమావేశాలు ఎలా నిర్వహించాలన్నది సమస్యగా మారింది.

ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు ఇలా వర్చ్యువల్ సమావేశాలు నిర్వహించాయి. ఇప్పుడు భారత్ ప్రభుత్వం ఈ సమావేశాలు నిర్వహిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News