జగన్​ ను బుక్ చేయడానికి రూల్సే మార్చేశారు

Update: 2016-03-15 10:29 GMT
 వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటింపజేసేందుకు వైసీపీ అధినేత జగన్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. నిన్న అవిశ్వాస తీర్మానం ఇవ్వగా వెంటనే చర్చను చేపట్టి విప్ జారీచేసేందుకు సమయం ఇవ్వకుండా చేసిన టీడీపీ ప్రభుత్వం మంగళవారం ఏకంగా ఇంకా ముందుకెళ్లింది. మంగళవారం వైసీపీ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టగా టీడీపీ ఏకంగా రూల్సే మార్చేసింది. స్పీకర్ పై అవిశ్వాసం పెడితే కనీసం 14 రోజుల తరువాతే చర్చ జరపాలి.... ఆలోగా అవిశ్వాసం పెట్టిన పార్టీ విప్ జారీ చేస్తుంది. ఆ విషయాన్ని జగన్ ఆధారాలతో సహా చూపించారు. కానీ.... ఆ నిబంధన ఉన్న రూల్ ను తొలగించాలని యనమల రామకృష్ణుడు ప్రతిపాదించడం... టీడీపీ సభ్యులు తమ బలంతో మూజువాణి ఓటుతో ఆమోదిందుకున్నారు. దీంతో ఆ రూల్ ను తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ పరిణామం జగన్ నే కాకుండా ప్రజాస్వామ్యవాదులందరినీ షాక్ కు గురిచేసింది.
   
ఈ పరిణాల సందర్భంగా యనమల ''రూల్స్ మాకు తెలియనివి ఏమీ కావు... అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్. రూల్ 358 కింద తీర్మానం ప్రవేశపెడుతున్నాం. రూల్ 71-2, 3 లను సస్పెండ్ చేయాలని కోరుతున్నాం'' అంటూ ఆ నిబంధనలు రద్దు చేసే ప్రతిపాదన పెట్టారు. దాన్ని స్పీకర్ ఆమోదించారు. కాగా మంగళవారం కూడా పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. మొత్తానికి జగన్ చట్టం ప్రకారం వెళ్లినా అందులోని లొసుగుల ఆధారంగా టీడీపీ ఏకంగా ఆ నిబంధనలనే రద్దు చేయించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News