రాజ్యసభలో 12 మంది ఎంపీలపై సస్పెన్షన్.. ఎవరంటే?

Update: 2021-11-29 16:08 GMT
మునుపెన్నడూ లేనివిధంగా కేంద్రం కన్నెర్ర జేసింది. పార్లమెంట్ లో లొల్లి చేస్తే ఇన్నాళ్లు వాయిదాలతో కాలం గడిపిన కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక ఆందోళన చేసే ఎంపీలను ఉపేక్షించేది లేదని స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది.

పార్లమెంట్ ప్రారంభం కాగానే విపక్షాల నుంచి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వ్యవసాయ చట్టాలపై చర్చించాలంటూ నినదించారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పలుమార్లు సభ వాయిదా పడింది.

వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో మరోసారి గందరగోళం ఏర్పడడంతో రాజ్యసభ చైర్మన్ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.కమ్యూనిస్టు పార్టీలకు చెందిన  ఎలమరం కరీం, బినోయ్,టీఎంసీకి చెందిన డోలాసేన్ శాంత చత్రీ, శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది అనిల్ దేశాయ్ లతోపాటు కాంగ్రెస్ కు చెందిన పూలోదేవినేతమ్, చాయ్ వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, నాసిర్ హుస్సేన్, అఖిలేష్ ప్రసాద్ లను సస్పెండ్ చేశారు.

సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ తెలిపారు. గత వర్షకాల సమావేశాల్లో కూడా రాజ్యసభ చైర్మన్ ను కించపరిచారని పలువురిని సస్పెండ్  చేసిన విషయం తెలిసిందే..
Tags:    

Similar News