స్మితా సభర్వాల్ ట్వీట్ సంచలనం..

Update: 2022-11-08 16:44 GMT
తెలంగాణ సీఎంఓ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన స్మితా సభర్వాల్ అప్పట్లో తెగ వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ప్రొఫైల్ ను మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా స్మిత సభర్వాల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియా తీవ్ర చర్చనీయాంశమవువుతున్నాయి. ట్విటర్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలకు మహిళల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.

ముందస్తు విచారణకు అవకాశం లేదనే కారణంతో గ్యాంగ్ రేప్ నకు పాల్పడిన నిందితుడి శిక్షను గత వారం మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 25 ఏళ్లకు విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ హైకోర్టు నిందితుడికి రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. సదురు నిందితుడు బెయిల్ పై విడుదలయ్యాడు.

ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పలువురు మహిళలు, ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై తాజాగా స్మిత సభర్వాల్ సైతం స్పందించారు. ‘న్యాయవ్యవస్థలో నిరాశ కలిగించే ఈ తరహా తీర్పులు ఇంకా కొనసాగితే దేశంలోని మహిళలకు ఆయుధాలు ధరించే హక్కును అనుమతించే సమయం ఆసన్నం అవుతుందన్నారు.న్యాయం, చట్టం రెండు వేర్వేరు విషయాలు కావు.. ఇది సిగ్గు చేటు’ అంటూ కామెంట్ చేశారు.
Read more!

స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మహిళల విషయంలో మీరు చేస్తున్న పోరాటం అభినందనీయం అంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. తీర్పుపై సూటిగా స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇలాంటి వాటిపై ధైర్యంగా స్పందిస్తున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News