భర్త ప్రవర్తనతో నరకయాతన.. సింధూరం తిని వివాహిత బలవన్మరణం..

Update: 2020-12-11 04:25 GMT
భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఓ మహిళ బొట్టుపెట్టుకొనే సింధూరం అధికమోతాదులో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నది. అయితే సింధూరంలో పాదరసం శాతం ఎక్కువగా ఉండటంతో ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుందని డాక్టర్లు నిర్ధారించారు.  గుజరాత్​ లోని డాన్పూర్‌ కు చెందిన వికాస్ బింద్‌ కు మూడేళ్ల క్రితం సరస్వతి దేవి(26)తో వివాహం అయ్యింది. వీరికి కూతురు (2)  కూడా ఉంది. వికాస్​ వృత్తిరీత్యా సూరత్​లో ఉంటున్నాడు. భార్యను మాత్రం డాన్పూర్​లో ఉంచాడు. అప్పుడప్పుడు మాత్రం డాన్పూర్​కు వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో తనను కూడా సూరత్​ తీసుకెళ్లాలని సరస్వతి తరుచూ కోరేది. కానీ వికాస్​ మాత్రం ఎందుకో ఒప్పుకొనేవాడు కాదు. ఈ క్రమంలో కరోనా లాక్​ డౌన్​ వచ్చింది. దీంతో వికాస్​ డాన్పూర్​కు వచ్చేశాడు.

అయితే లాక్​డౌన్​ ఎత్తేయగానే మళ్లీ సూరత్​ వెళ్లిపోయాడు. తనను కూడా సూరత్​ తీసుకెళ్లాలని సరస్వతి పట్టుబట్టింది. కానీ వికాస్​ ఒప్పుకోలేదు. ఈ విషయంలో భార్యభర్తలకు గొడవలు జరిగాయి. మరోవైపు వికాస్​ సూరత్ ​లో మరో మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. అందుకే నిన్ను పట్టించుకోవడం లేదంటూ ఇరుగుపొరుగు వారు సరస్వతి తో అన్నారు.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సరస్వతి సింధూరం అధికమొత్తంలో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సింధూరంలో పాదరసం ఎక్కువగా ఉండడంతో ఆమె అనారోగ్యానికి గురైంది. చుట్టుపక్కల వాళ్లు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
    

Tags:    

Similar News