వైరల్ వీడియో.. కోట్ల రూపాయల కారును కాల్చేశాడు
కోట్లు పోసి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కారును పెట్రోల్ పోసి తగలబెట్టేశాడో వ్యక్తి. అదేమీ బీమా కోసం ఆడిన డ్రామా కూడా కాదు. ఆ కారు పదే పదే ట్రబుల్ ఇస్తుండటం, దాన్ని బాగు చేయాల్సిన డీలర్, తయారీ సంస్థ నిర్లక్ష్యం వహించడమే ఇందుకు కారణం. ఇలా కోట్ల రూపాయల కారును తగలబెట్టడమే కాదు. దాన్ని వీడియో కూడా తీసి నెట్లో పెట్టేశాడు. దానికి కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ కారు తగలబెట్టడం వెనుక కథేంటో చూద్దాం పదండి.
రష్యాకి చెందిన మైఖేల్ లిట్విన్ ఒక యూట్యూబర్. అనేక సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ వాటిని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతడికి ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. బాగా డబ్బున్న మైఖేల్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన మెర్సీడెజ్-ఏఎంజీ జీటీ 63 కారును కరొన్నాడు. దాని ఎక్స్ షోరూం ధరే మన రూపాయల్లో అయితే 2.4 కోట్లు. ఆన్ రోడ్ అయితే ఇంకా ఎక్కువ. ఐతే ఎంతో ముచ్చటపడి కొన్న ఆ లగ్జరీ కారు పదే పదే బ్రేక్ డౌన్ అవుతూ లిట్విన్‌ను ఇబ్బంది పెట్టింది. అతను ఐదుసార్లు మెర్సీడెజ్ డీలర్ దగ్గరికెళ్లి సమస్యను చెప్పుకున్నాడు.
ఐతే ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఆ డీలర్ రెండు రోజులు కారును తన గ్యారేజీలో పెట్టుకుని బాగు చేయకుండానే తిరిగిచ్చేస్తున్నాడన్నది లిట్విన్ ఆరోపణ. మళ్లీ మళ్లీ సమస్య తలెత్తుతుండటం, డీలర్ కానీ, తయారీ సంస్థ కానీ సరిగా స్పందించకపోవడంతో లిట్విన్‌కు మండిపోయింది. ఆ కోపంలో అతను ఓ విశాలమైన ప్రాంతానికి కారును తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. కారు మంటల్లో తగలబడుతుంటే వీడియో కూడా తీసి తన యూట్యూబ్ ఛానెల్లోనే పోస్ట్ చేశాడు. తనకు తానే ఈ కారును తగలబెట్టేశాడు కాబట్టి అతడికి ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఐతే దీని వల్ల అతడి వీడియో మాత్రం పాపులర్ అయి భారీగా వ్యూస్ తెచ్చి పెడుతోంది. తద్వారా ఆదాయం వస్తోంది. ఐతే దీని వల్ల మెర్సీడెజ్ కంపెనీకి మాత్రం బాగానే డ్యామేజ్ జరుగుతోంది.Full View
రష్యాకి చెందిన మైఖేల్ లిట్విన్ ఒక యూట్యూబర్. అనేక సాహసాలు, ప్రాంక్ వీడియోలు చేస్తూ వాటిని తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతడికి ఫాలోవర్ల సంఖ్య భారీగానే ఉంది. బాగా డబ్బున్న మైఖేల్ ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన మెర్సీడెజ్-ఏఎంజీ జీటీ 63 కారును కరొన్నాడు. దాని ఎక్స్ షోరూం ధరే మన రూపాయల్లో అయితే 2.4 కోట్లు. ఆన్ రోడ్ అయితే ఇంకా ఎక్కువ. ఐతే ఎంతో ముచ్చటపడి కొన్న ఆ లగ్జరీ కారు పదే పదే బ్రేక్ డౌన్ అవుతూ లిట్విన్‌ను ఇబ్బంది పెట్టింది. అతను ఐదుసార్లు మెర్సీడెజ్ డీలర్ దగ్గరికెళ్లి సమస్యను చెప్పుకున్నాడు.
ఐతే ఫిర్యాదు చేసిన ప్రతిసారీ ఆ డీలర్ రెండు రోజులు కారును తన గ్యారేజీలో పెట్టుకుని బాగు చేయకుండానే తిరిగిచ్చేస్తున్నాడన్నది లిట్విన్ ఆరోపణ. మళ్లీ మళ్లీ సమస్య తలెత్తుతుండటం, డీలర్ కానీ, తయారీ సంస్థ కానీ సరిగా స్పందించకపోవడంతో లిట్విన్‌కు మండిపోయింది. ఆ కోపంలో అతను ఓ విశాలమైన ప్రాంతానికి కారును తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. కారు మంటల్లో తగలబడుతుంటే వీడియో కూడా తీసి తన యూట్యూబ్ ఛానెల్లోనే పోస్ట్ చేశాడు. తనకు తానే ఈ కారును తగలబెట్టేశాడు కాబట్టి అతడికి ఇన్సూరెన్స్ కూడా వచ్చే అవకాశం లేదు. ఐతే దీని వల్ల అతడి వీడియో మాత్రం పాపులర్ అయి భారీగా వ్యూస్ తెచ్చి పెడుతోంది. తద్వారా ఆదాయం వస్తోంది. ఐతే దీని వల్ల మెర్సీడెజ్ కంపెనీకి మాత్రం బాగానే డ్యామేజ్ జరుగుతోంది.