ప్రియాంకగాంధీకి పట్టాభిషేకం ఖాయమైనట్టేనా?

Update: 2020-08-10 17:30 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వయోభారంతో బాధపడుతున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని త్యజించాడు. మళ్లీ తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. కాంగ్రెస్ లోని వృద్ధ జంబూకాలను పక్కకు తప్పిస్తేనే తాను పగ్గాలు తీసుకుంటానంటున్నాడు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్ష భారాన్ని సోనియా మోయలేక సతమతమవుతున్నారు.

కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని.. రాహుల్ గాంధీని ఒప్పించి ఇందిరాగాంధీ స్టైల్ లో ఉండే ప్రియాంక గాంధీని ఫ్రంట్ లైన్ లోకి తీసుకొని రావాలని కాంగ్రెస్ పెద్దలు వ్యూహరచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా వార్తలు వెలువడుతున్నాయి. ప్రియాంక గాంధీకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉందని.. త్వరలో ఆమెకు పట్టాభిషేకం కట్టబెట్టుతున్నారని ఢిల్లీ వర్గాల భోగట్టా.

ఉత్తర భారత బాధ్యతలను ప్రియాంక గాంధీకి, దక్షిణ భారత బాధ్యతలను రాహుల్ గాంధీకి అప్పగించి ఇద్దరితో పర్యటనలు చేయించాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారని టాక్. ఇలా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని ఎలాగైనా ఓడించాలని.. తమ తూరుపు ముక్కగా ప్రియాంక గాంధీని చేయాలన్నది కాంగ్రెస్ పెద్దల అభిమతమని ప్రచారం సాగుతోంది.
Tags:    

Similar News