రూ. 1 ఫైన్ పై ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్!

Update: 2020-10-02 12:30 GMT
కోర్టు ధిక్కరణ కేసులో ఆగస్టు 14న ప్రశాంత్ భూషణ్ ‌ను దేశ అత్యున్నత నాయస్థానం  సుప్రీం కోర్టు దోషిగా తేల్చింది. ప్రశాంత్ భూషణ్ తీరు కోర్టు ధిక్కరణకు సంబంధించి తీవ్రమైన విషయమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆగస్టు 31న శిక్షను ఖరారు చేసిన కోర్టు.. ఒక రూపాయి జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష విధించాలని స్పష్టం చేసింది. తర్వాత, ఆ కేసులో కోర్టు విధించిన ఒక రూపాయి జ‌రిమానాను  లాయ‌ర్ ప్ర‌శాంత్ భూష‌ణ్ చెల్లించిన విష‌యం తెలిసిందే. అదే సమయంలో కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్తానని ఆరోజే చెప్పారు.

అయన చెప్పినట్టుగానే .. ఆ కేసులో మ‌ళ్లీ రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశారాయ‌న‌. ఆగ‌స్టు 31వ తేదీన ఇచ్చిన తీర్పుపై రివ్యూ చేయాల‌ని కోరారు.  గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన తప్పుబట్టారు. తనపై కేసు వేసిన లాయర్ పిటిషన్ కాపీని తనకు ఇవ్వకుండానే ఏకపక్షంగా తీర్పు చెప్పారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మొత్తం రెండు రివ్యూ పిటిషన్లు వేశారు ప్రశాంత్ భూషణ్. ర్టు స్వయంగా హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు.. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు.

ఇదేకాదు , ప్రశాంత్ భూషణ్ ‌పై మరో కోర్టు ధిక్కరణ కేసు కూడా నడుస్తోంది. 2009లో తెహెల్కా మ్యాగజైన్ ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుప్రీంకోర్టులో అవినీతి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చివరి 16 మంది చీఫ్ జస్టిస్‌లు అవినీతికి పాల్పడ్డారని ప్రశాంత్ భూషణ్ ఆరోపించారు. ప్రస్తుతం ఈ కేసును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదిస్తున్నారు.
Tags:    

Similar News