అరే.. ముజ్రా పార్టీలో దొరికింది వాళ్లా?

Update: 2016-02-07 09:05 GMT
కుర్రాళ్లు ముచ్చటపడి పార్టీలు మామూలే. వయసులో ఉన్నోళ్లు పార్టీలు చేసుకుంటుంటారు. కాకుంటే ఒక్కోసారి హద్దులు దాటి.. చట్టవిరుద్ధమైన పార్టీలు చేసుకుంటూ దొరికిపోవటం మామూలే. తాజాగా హైదరాబాద్ లో శనివారం రాత్రి ముజ్రా పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. ఇంతకీ ముజ్రా పార్టీ అంటే ఏమిటంటే.. డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించుకుంటూ మందు పార్టీతో ఎంజాయ్ చేయటం.. అనైతిక వ్యవహారాల్నినడపటంగా చెబుతుంటారు.

ఈ తరహా పార్టీలు నగరంలో తక్కువే. కానీ.. తాజా వ్యవహారంపై పోలీసులు కాస్త లోతుగా విచారిస్తే ఆసక్తికర అంశాలు లభించాయి. ముజ్రాపార్టీ చేసుకున్న వారంతా జీహెచ్ ఎంసీ ఉద్యోగులేనని తేలటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముజ్రా పార్టీ సందర్భంగా దాదాపు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరి వద్దనుంచి వివరాలు సేకరించి.. వారి ఫోటోల్ని గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డికి పంపగా.. వారంతా తమ ఉద్యోగులేనన్న విషయాన్ని ధ్రువీకరించారు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. అనైతిక కార్యకలాపాలు చేస్తున్నందుకు వారిపై చర్యలు తీసుకునేందుకు గ్రేటర్ కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. వారిని సస్పెండ్ చేస్తూ వేటు వేశారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల్లో ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ల మొదలు బిల్ కలెక్టర్లు వరకూ ఉండటం గమనార్హం. బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉంటూ జాగ్రత్తగా ఉండాల్సింది పోయి చట్టవిరుద్ధమైన పార్టీలు చేసుకోవటం ఏమిటో..?
Tags:    

Similar News