విలాసాల కోసం ఇళ్లకు కన్నాలు .. యూట్యూబ్ సాయంతో !
ఒకప్పుడు టీవీలు, సినిమాల్లో చూసి నేరాలు చేసేవారు. తాజాగా యూ ట్యూబ్ వేదికగా దొంగతనాలు ఎలా చేయాలో కూడా నేర్చుకుంటున్నారు. అయితే , మొదట్లో యూట్యూబ్ చెప్పిన పాఠాలతో దొంగతనం పక్కాగా చేసి , పోలీసులకి సవాల్ విసిరినా కూడా , యూట్యూబ్ పథకం విఫలమై పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ఈ ఘటన విశాఖజిల్లాలో చోటు చేసుకుంది. ఈ కేసు వివరాలను క్రైం డీసీపీ వి.సురేష్‌బాబు గాజువాక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దరి కాళ్లకూరు గ్రామానికి చెందిన ఎన్. వినోద్ రాజు ఎంబీఏ చదివాడు. అయితే, చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రాకపోవడంతో ఖాళీగా ఉంటూనే జల్సాల కోసం స్నేహితులు, బంధువుల వద్ద సుమారు రూ.7 లక్షల వరకూ అప్పులు చేశాడు. ఆ తర్వాత గాజువాకలో ఉండే ఫ్రెండ్ ద్వారా ఓ గదిని అద్దెకు తీసుకుని సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలో గూగుల్ లో వెతకడం మొదలు పెట్టాడు. ఆ సమయం లోనే దొంగతనం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఇంటి తాళాలు ఎలా పగులగొట్టాలో యూట్యూబ్ లో చూసి అందుకు అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకున్నాడు. గ్యాస్ కట్టర్ తో ఇళ్ల తలుపులను ఎలా తెరవవచ్చో నేర్చుకున్నారు.
గతేడాది అక్టోబరు 1న కలెక్టరేట్ ఉద్యోగి ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి వస్తువులు, ఒక కెమెరాను దొంగిలించాడు. కొద్దిరోజుల తర్వాత అదే వీధిలోని ఓ బీమా సంస్థ, మరో కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ ఫ్లెక్సీల తయారీ కేంద్రాల్లో పది కంప్యూటర్ మానిటర్లు, 8 సీపీయూలు, ఒక స్కానర్, హోండా యాక్టివా స్కూటీ ని దొంగతనం చేశాడు. ఇలా గాజువాక ప్రాంతంలో వరుస చోరీలకు పాల్పడటం తో బాధితుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. దీనితో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న క్రైం బ్రాంచ్ ఏసీపీ సీహెచ్ పెంటారావు, సౌత్ ఏసీపీ రామాంజనేయులు రెడ్డి, గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి నిందితుడి బండారాన్ని బయటపెట్టారు. అతడి నుంచి రూ.3.50 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించారు.