దత్తత తీసుకోవాలని చరణ్ ను అడుగుతా: పవన్

Update: 2018-10-21 05:33 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని టిట్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం ప్రజలకు తెలుగు ప్రజలంతా అండగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలు - ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకొని ఆదుకోవాలని కోరారు. తాను రాంచరణ్ ను శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కోరుతానని పవన్ చెప్పారు.  

నష్టపోయిన చెట్లకు వందో - ఐదు వందలో ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని పవన్ అన్నారు. నష్టపోయిన రైతులకు రుణమాఫీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే.. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ చేస్తామని పవన్ హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఇంకా చీకట్లోనే ఉందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదని పవన్ వాపోయారు. సీఎం ఇంట్లో ఒక్కరోజు కరెంట్ పోతే ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. తుఫాను బాధితులను ఇబ్బంది పెట్టవద్దనే తాను 4 రోజులు ఆలస్యంగా పర్యటించానని పవన్ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News