నోటీసులు: సింధు ఫొటో పర్మిషన్ లేకుండా వాడారు

Update: 2021-08-08 08:03 GMT
తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటింది. ఆమె కాంస్యం గెలవడంతో కేంద్రమంత్రులు, ఢిల్లీ పెద్దలు అభినందనల్లో ముంచెత్తారు. ఈ క్రమంలోనే సింధూకు ఇప్పుడు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది.

పివీ సింధు అంటే ఇప్పుడు దేశంలోని యువతకు స్ఫూర్తి. ఆమె ఫొటో కనిపిస్తే చాలా ఆ బ్రాండ్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. ఆ క్రేజ్ ను వాడుకోవడానికి చాలా బ్రాండ్ సంస్థలు పోటీపడుతున్నాయి.

అయితే తాజాగా దాదాపు 20కి పైగా బ్రాండ్ లు అనుమతి లేకుండా పీవీ సింధు ఫొటోను వాడుకున్నాయి. దీంతో వారికి నోటీసులు జారీ అయ్యాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భాగస్వాములైన బ్రాండ్ లకు మాత్రమే పీవీ సింధు ఫొటోలను ఉపయోగించడానికి అనుమతి ఉంది. కానీ పలు బ్రాండ్లు ఒలింపిక్స్ మార్గదర్శకాలను ఉల్లంఘించాయని.. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన పీవీ సింధు ఇమేజ్ ను వాడుకున్నాయని 'బేస్ లైన్ వెంచర్స్' ఆరోపించింది. నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి బాండ్.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆయా బ్రాండ్ లకు లీగల్ నోటీసులు పంపింది.

హ్యాపీడెంట్, పాన్ బహార్, యూరేకా ఫోర్బ్స్, ఐసీసీఐ బ్యాంక్, హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్, వోడాఫోన్ ఐడియా, ఎంజీ మోటార్, యూకో బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , స్టేట్ బ్యాంక్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, సహా పలు బ్రాండ్ లు పీవీ సింధు ఫొటో వాడినందుకు నోటీసులను పంపారు.  మరికొన్ని బ్రాండ్ లకు నోటీసులు పంపనున్నారు.

నిబంధనలను ఉల్లంఘించిన వారు వెంటనే ఆ పోస్టులను వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించాలని బేస్ లైన్ వెంచ్చర్ డిమాండ్ చేసింది.
Tags:    

Similar News