దేశంలోని ఆ రాష్ట్రంలో కరోనాను ఖతం చేశారట

Update: 2020-04-02 23:30 GMT
నిజంగానే నిజం. దేశంలో కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం.. కరోనాను ఖతం పట్టించటమే కాదు.. గడిచిన కొద్దిరోజులుగా ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవటం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడా రాష్ట్రం దేశానికి ఆదర్శంగా మారటమే కాదు.. మిగిలిన పాజిటివ్ రాష్ట్రాలన్ని ఆ రాష్ట్రం బాటలో పట్టాలంటున్నారు. కరోనా కేసులు వెలుగు చూశాక.. వెనువెంటనే కంట్రోల్ చేయటం సాధ్యమయ్యే పని కాదు. కానీ.. ఆ క్లిష్టతను అధిగమించింది కొత్త రాష్ట్రమైన లేహ్.. లద్దాఖ్.

గడిచిన పన్నెండు రోజులుగా ఆ రాష్ట్రంలో కొత్త కరోనా కేసు ఒక్కటి కూడా పాజటివ్ గా నమోదు కాలేదంటున్నారు. ప్రస్తుతం పదిమంది క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని.. అంతకు మించి కొత్త కేసులు ఏవీ వెలుగు చూడలేదని చెబుతున్నారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో పెద్ద వయస్కుడు ఒకరు మరణించారు. అది మినహా మరెలాంటి మరణాలు లేవు.

అయితే.. ఆయనకు కరోనా సోకటానికి ముందే.. కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇరాన్ వెళ్లి వచ్చిన పలువురికి రాష్ట్రంలో కరోనా సోకిందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉండటమే కాదు.. గడిచిన కొద్ది రోజులుగా కొత్తకేసు నమోదు కాకపోవటంతో.. ఆ రాష్ట్రంలో కరోనా ఖతమైనట్లేనని భావిస్తున్నారు. ఆ చిన్న రాష్ట్రంలో కరోనా భూతాన్ని ఎలా అధిగమించారన్నది కేస్ స్టడీగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోకస్ పెడితే మంచిదేమో?
Tags:    

Similar News