బీయారెస్ తాను తీసుకున్న గోతిలో పడుతోందా...?
టీయారెస్ గా ఉన్నపుడు ఆ ఠీవీ ఆ దర్జా వేరుగా ఉండేది. తెలంగాణా మొత్తం కర్ర పెత్తనం చేస్తూ వేరే ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వకుండా రానీయకుండా జబర్దస్త్ చేసేది ఇదేంటి ప్రజాస్వామ్యం కదా అంటే కష్టపడి సాధించుకున్న తెలంగాణాలో ఆంధ్రా వారు మళ్లీ వచ్చి రాజ్యం చేస్తారా అంటూ హూంకరించేది. నిజానికి తెలంగాణా సెంటిమెంట్ కర్ణుడి కవచ కుండలాల మదిరిగా టీయారెస్ ని ఎంత పెద్ద కష్టం లో నుంచి అయినా రక్షించేవి. అలాగే టీయారెస్ అనేక రాజకీయ సవాళ్ళను ఎదుర్కొన్నా కూడా తెలంగాణా మంత్రంతో బయటపడేది.
కానీ ఇపుడు సీన్ మారింది. ఏకంగా టీయారెస్ కాస్తా బీయారెస్ అయింది. పేరులో తెలంగాణా లేదు ఆ కళ కూడా కనిపించడంలేదు. బీయారెస్ అంటే కొత్తగా ఉంది. గమ్మత్తుగా ఉంది. దీని వల్ల వచ్చే లాభమేంటో తెలియదు కానీ ఉన్న చోట ఉనికి పోరాటంగా మారుతోంది అని అంటున్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు ఖమ్మం సభతో రీసౌండ్ చేశారు అంటే దానికి కారణం బీయారెస్ గా టీయారెస్ మారిపోవడమే. అసలే బాబుకు చిన్న చాన్స్ ఇస్తే చాలు దూసుకుపోతారని పేరుంది. అలాంటి బాబుకు ఏకంగా తెలంగాణాలోకి దారిచ్చేశారు.
దాంతో దర్జాగా వచ్చి మరీ మీటింగ్ పెట్టిన చంద్రబాబు తెలంగాణాను తానే అంతా చేశాను అని చెప్పుకున్నారు. ఆయన తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీయార్ తాను చేసిన పాలన మొత్తం చెప్పుకున్నారు. తెలంగాణాకు టీడీపీ అవసరం కచ్చితంగా ఉంది అని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకున్నారు. తన ప్రభుత్వం అప్పట్లో పాలించినపుడు చేసిన అభివృద్ధిని కూడా బాబు గుర్తు చేశారు.
మొత్తానికి చూస్తే చంద్రబాబు ఖమ్మం సభ సూపర్ హిట్ అయిపోయింది. దీంతో బీయారెస్ గా మారిన టీయారెస్ కి కలవరం రేగింది. బాబు ఎందుకు తెలంగాణాకు వచ్చారు అని వారు ఇపుడు అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. కారణం బీయారెస్ పేరిట జాతీయ రాజకీయాలు చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి. రేపు ఏపీకి వచ్చి మరీ తన సత్తా చాటాలనుకుంటున్నారు కాబట్టి. కానీ లాజిక్ ఏంటి అంటే బాబు ఉమ్మడి సీఎం గా పదేళ్ళు పనిచేశారు. ఆయన చెప్పుకోవడానికి తెలంగాణాలో చాలా ఉంది.
అలాగే ఎన్టీయార్ పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి అక్కడ బీసీలకు రాజకీయ అధికారాన్ని ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో విజయాలు ఉన్నాయి. సో బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని రీ యాక్టివేట్ చేయడం పెద్దగా కష్టం కాబోదు. ఇక తెలంగాణా మాది, మీరెవరు అని అడిగే ప్రతిబంధకం లేని చోట బాబు మార్క్ పాలిటిక్స్ ఏంటో ఇపుడు చూపిస్తారు. దాన్ని బీయారెస్ అలా చూస్తూ ఉండాల్సిందే. ఇదంతా చేజేతులా కేసీయార్ చేసుకున్నదే అవుతోంది అని అంటున్నారు.
బీయారెస్ అంటూ జాతీయ పార్టీ అంటూ తెలంగాణా అస్థిత్వాన్ని పార్టీ పేరులో లేకుండా చేసుకోవడం వ్యూహత్మకమైన తప్పిదం అని అంటున్నారు. ఇపుడు చంద్రబాబు మళ్ళీ రీ సౌండ్ చేస్తున్నారు. ఆయన ధాటీగా వరసబెట్టి తెలంగాణా అంతటా సభలు నిర్వహిస్తే ఆయనకు ఉన్న బలం పెరుగుతుంది. దాంతో ఆ బలం ఎక్కడ నుంచి వస్తుంది అంటే బీయారెస్ లో ఉన్న వారి నుంచే. టీడీపీ నుంచే పెద్ద సంఖ్యలో బీయారెస్ లోకి గతంలో వెళ్ళారు. వారినే బాబు గురి పెడుతున్నారు. రేపతి రోజున వారిలో కొందరైనా వెనక్కి వచ్చినా బాబు తెలుగుదేశాన్ని తెలంగాణాలో మరింతగా బలోపేతం చేసినా భారీ నష్టం ఎదుర్కోబోయేది కచ్చితంగా బీయారెస్ మాత్రమే.
అసలే రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీగా యాంటీ ఇంకెంబెన్సీని బీయారెస్ ఎదుర్కోంటోంది. దాంతో ఇపుడు చంద్రబాబు తన పార్టీని పటిష్టం చేసుకోవడం మొదలుపెడితే మాజీ తమ్ముళ్ళు ఆ వైపుగా చూస్తే కనుక కచ్చితంగా దెబ్బ పడేది బీయారెస్ కే. అందుకే హరీష్ రావు కనీ కవిత కానీ టీడీపీ మీద చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలలో మునుపటి ధాటీ లేదు, తెలంగాణా ఆంతగౌరవం అన్న పెద్ద మాటలు లేవు.
జస్ట్ రాజకీయ విమర్శలుగానే పేలవంగా తేలిపోతున్నాయి. దాంతో బాబు ముందు ముందు దూకుడు చేస్తే కచ్చితంగా బీయారెస్ కి అది ప్రాణ సంకటమే అవుతుంది అని అంటున్నారు. నెక్ టూ నెక్ అన్న పరిస్థితులు ఉన్న తెలంగాణలో టీడీపీ ఏ మాత్రం పుంజుకున్నా ఆ మేరకు భారీ నష్టం బీయారెస్ కే అని చెప్పకతప్పదు అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.