దిశ నిందితుల చేతిలో గన్

Update: 2019-12-06 11:16 GMT
హైదరాబాద్ లో నలుగురు నిందితులను ఈ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. విచారణలో భాగంగా నిందితులను ‘దిశ’ను కాల్చిన చోటుకు తీసుకెళ్లగా.. అక్కడ సీన్ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించడం.. రాళ్లు రువ్వడం.. పోలీసులపై తిరగబడడంతో ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు.

కాగా  శంషాబాద్ లోని చట్రాన్ పల్లి వద్ద ఈ ఉదయం తెల్లవారుజామున దిశను ఎక్కడైతే చంపారో అక్కడే సీన్ రికన్ స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు నలుగురు నిందితులను అక్కడికి తీసుకెళ్లారు. ఈ సమయంలోనే నిందితులు  పారిపోయేందుకు ప్రయత్నించడంతోపాటు పోలీసుల నుంచి గన్ లాక్కొని పారిపోయారు. మరో నిందితుడు  చెన్నకేశవులు కూడా పోలీస్ గన్ తీసుకొని పారిపోయారు. పోలీసులపై కాల్పులు జరపడానికి రెడీ అయ్యారు.

 మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు చేతిలో గన్ తో పోలీసులపై కాల్పులు జరపడానికి రెడీ కాగా వారిని పోలీసులు  కాల్చేశారు. ఆరీఫ్ కాల్పులు జరపగా.. తరువాత చెన్నకేశవులు కాల్పులు దిగారు. ఇందులో వెంకటేశ్వర్లు అనే ఎస్సైకి గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ బానోతు కూడా గాయపడ్డారు. వారిని కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రధానంగా నిందితులు ఆరీఫ్, చెన్నకేశవులు గన్ లు  లాక్కొని పారిపోతుండగా తాము ఆత్మరక్షణార్థం చంపేశామని సీపీ సజ్జనార్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.
Tags:    

Similar News