ఒక్కరోజే 6,41,035 కేసులు - 12,356 మరణాలు!

Update: 2020-12-03 17:20 GMT
కరోనా ... కరోనా ... కరోనా .. ఈ పేరు గత ఏడాది కాలంగా ప్రపంచాన్ని భయంతో వణికిస్తుంది. ప్రపంచంలో ప్రతిరోజూ కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో కరోనా తగ్గుముఖం పట్టినా కూడా , భారీగానే కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు కావడంతో మళ్లీ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య  పెరుగుతుంది. నిన్న ఒక్క రోజు 6,41,035 పాజిటివ్ కేసులు, 12,356 మరణాలు సంభవించాయి.

కాగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,007,605కి చేరింది. అలాగే ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా  1,502,530 మంది కరోనాతో మరణించారు. ఇక 45,095,097 మంది కరోనా వైరస్ ‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,314,265కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 279,867 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.   గత 24 గంటల్లో 35,551 మందికి కరోనా మహమ్మారి నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,34,965కి చేరింది. ఇక గత 24 గంటల్లో 40,726 మంది కోలుకున్నారు.  ఇందులో 89,73,373 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,22,943 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.


Tags:    

Similar News