రెండవ వైపు తానేంటో చూపించిన పేర్ని నాని ...?
ఆయన ఎపుడూ సరదాగా ఉంటారు. జోక్స్ వేశారూ అంటే మీడియాలో నవ్వులే. ఆయన మాటలతో పాటు వెటకారం వేరే రేంజిలో ఉంటుంది. రాజకీయ ప్రత్యధులను విమర్శించే విషయంలో స్టైలే సెపరేట్ అన్నట్లుగా కూడా ఉంటారు. అలా మిష్టర్ కూల్ గా ఉండే వైసీపీ మంత్రి పేర్ని నాని ఇపుడు తానేంటో రెండవ వైపు చూపించేసరికి బిత్తరపోవడం పోలీస్ అధికారుల వంతు అయింది.
ఇదేంటి సారూ మీలో ఈ కోణం కూడా ఉందా అని అక్కడ ఉన్న వారు సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇంతకీ పేర్ని నాని ఇలా ఫైర్ అవడానికి దారి తీసిన కారణాలు ఏంటి అంటే అక్కడే అసలైన స్టోరీ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించడానికి నేరుగా ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారు. ఆయన ముఖ్యమంత్రి జగన్ తో కలసి ప్రాజెక్ట్ పనులను చూస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి జిల్లా ఇంచార్జి మంత్రి హోదాలో పేర్ని నాని కూడా అక్కడకు చేరుకున్నారు. అయితే ఆయన కారుని తీసేయమంటూ పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా రగిలిపోయారు. అప్పటికే భద్రతా కారణాలు చూపించి వైసీపీ ప్రజా ప్రతినిధులను ఈ పర్యటనలో పాలు పంచుకోనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అదీ ఇదీ కలసి మరీ పేర్ని విశ్వరూపమే చూపించారు.
ఏంటి తమాషాలు చేస్తున్నారా అంటూ నాని పోలీసుల మీద పెద్ద నోరు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్న కార్లు అన్నీ ఎవరివి, నా కారు ఎవరు తీయమంటున్నారు, ఎస్పీ, డీఐజీల కార్లు ఇక్కడ ఎందుకు ఉన్నాయి, నా కంటే వాళ్ళు ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ అంటూ నాని ఒక రేంజిలో విరుచుకుపడ్డారు.
ఇలాగైతే ఎలాగండీ, మీ మర్యాద కూడా కాపాడుకోండి అంటూ నాని మండిపడేసరికి పోలీసులు సైతం షాక్ తిన్నారు. మొత్తానికి నానికి పోలీసు అధికారులు సర్దిచెప్పి శాంతపరచారు. అది వేరే విషయం.
ఏమైనా సింహా సినిమాలో బాలయ్య డైలాగ్ కొట్టినట్లు ఒక వైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు అన్నట్లుగా నాని ఎపుడూ కూల్ అనుకుంటే అలాగే ఉంచాలి ఆయన్ని, ఆయనకు ఇబ్బంది పెడితే రెండవ కోణం ఏంటి అన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు పనులను చూడడానికి ఢిల్లీ నుంచి పెద్దవారు వస్తే పోలీసులు మాత్రం పేర్ని నాని విశ్వ రూపం చూడాల్సి వచ్చిందని అంటున్నారు.