ట్రంప్ కు భిన్నంగా ప్రిపేర్ అవుతున్న మెలానియా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎంత వివాదాస్పదమైన తీరును ప్రదర్శించారో.. అందుకు భిన్నంగా ఆయన సతీమణి మెలానియా ట్రంప్ తీరు ఉందని చెప్పక తప్పదు. ట్రంప్.. మెలానియాల మధ్య రిలేషన్ షిప్ విషయంలో కొన్ని సంచలన కథనాలు బయటకు వచ్చినా.. ఆమె మాత్రం పెదవి విప్పలేదు. తన పని తాను చూసుకుంటున్నట్లుగా వ్యవహరించారే తప్పించి.. అనవసరమైన అంశాల జోలికి వెళ్లలేదు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ కంటే ముందు.. ఆమె వైట్ హౌస్ విడిచి పెట్టేందుకు డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటికి ఎన్నికల్లో ఎదురైన ఓటమిని అంగీకరించే విషయంలో ట్రంప్ కిందామీదా పడుతున్నా.. అందుకు భిన్నంగా మెలానియా మాత్రం వైట్ హౌస్ ను విడిచి పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు.
దీనికి సంబంధించి ఆమె కొన్ని నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత బడ్జెట్.. సిబ్బంది కేటాయింపులు లాంటి విషయాల్ని చూసుకునేందుకు ఒక వ్యక్తిని ఆమె ఇప్పటికే నియమించుకున్నట్లు చెబుతున్నారు. అమెరికా ప్రథమ మహిళగా వ్యవహరిస్తున్న ఆమె.. వైట్ హౌస్ లోని గులాబీతోట సంరక్షణ.. ఈ ఏడాది క్రిస్మస్ సంబరాలతో పాటు.. తన బాధ్యతల్ని నిర్వర్తించే విషయంలో ఆమె బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్ష సతీమణులు అందరూ.. తమ వైట్ హౌస్ అనుభవాల్ని పుస్తకరూపం చేస్తుంటారు. వారి బాటలోనే పయనిస్తున్న మెలానియా.. ఈ విషయంలో తనదైన మార్క్ ను ప్రదర్శిస్తున్నారు. వైట్ హౌస్ లో తన అనుభవాల్ని పుస్తకరూపం చేస్తున్న ఆమె.. అందులో ఎక్కువ భాగం ఫోటోలతో నింపాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2024లో తిరిగి వైట్ హౌస్ లోకి అడుగుపెడతానని ట్రంప్ చెబుతున్నా.. ఆమె మాత్రం సందేహంతోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏమైనా ట్రంప్ కు భిన్నంగా ఆమె తీరు ఉంటుందని చెప్పక తప్పదు.