14 మంది ఫ్యామిలీ మెంబర్లను కత్తితో కోసేశాడు
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. తమ కుటుంబానికి చెందిన 14 మందిని కత్తితో పీకలు కోసేసిన ఒక కిరాతకుడి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ దారుణం సంచలనంగా మారింది. 14 మందిని చంపేయటంతో పాటు.. తానూ ఆత్మహత్య చేసుకున్న వైనంపై పలు సందేహాలు రేగుతున్నాయి. కత్తితో గొంతుల్ని కోసేసిన హంతకుడు.. చివరకు తానూ ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం.
ఈ దారుణం నుంచి బయటపడిన ఒక మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఆమె నోటి నుంచి వివరాలు బయటకు వస్తే కానీ అసలు సంగతులు తెలీవని చెబుతున్నారు. తన కుటుంబ సభ్యుల్ని ఇంత దారుణంగా ఎందుకు హతమార్చిన విషయంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ధానే నగరానికి సమీపంలోని కాసర్ వాడి ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పద్నాలుగు మందిని కిరాతకంగా హతమార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది ఇప్పుడు చర్చగా మారింది.