బాబు నాన్చుడు తీరు.. పార్టీ మారే వరకు వెళ్లిన యువనేత!
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంటే సరిపోతుందా? ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న విషయం మీద కొత్తగా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇందుకు మినహాయింపుగా చెప్పక తప్పదు. ఎప్పుడైనా.. ఏ తప్పునైనా ఒక్కసారి మాత్రమే చేయాలి. అందుకు భిన్నంగా బాబు మాత్రం.. అదే పనిగా తప్పుల మీద తప్పులు చేసి పార్టీకి తలనొప్పిగా మారుతుంటారు.
నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకోకుండా.. నెలల తరబడి నానిస్తే.. ఊరుకోవటానికి పాత తరం నేతలు కాదు కదా? ఇప్పుడున్న యువ నేతలంతా నిర్ణయాలు యమా ఫాస్ట్ గా తీసుకోవాలని తపిస్తుంటారు. అలాంటి వారికి భిన్నంగా బాబు వ్యవహారం ఉంటుందని చెప్పాలి. కీలకమైన అంశాల విషయంలో వెనువెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఆయన వాయిదా మీద వాయిదా వేసిన తీరుతో విసిగిపోతున్న నేతలు.. పార్టీ మారేందుకు సైతం సిద్ధమవుతున్నారు.
ఆ కోవలోకే వస్తారు మాజీ ఎంపీ మాగంటి వెంటేశ్వరరావు అలియాస్ మాగంటి బాబు. ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడటంతో ఆయన కుమారుడు రాంజీ సీన్లోకి వచ్చారు. అయితే.. మాగంటికి పదవిని అప్పజెప్పేందుకే బాబు ప్రాధాన్యత ఇవ్వటం..రాంజీ ఫ్యూచర్ ఏమిటన్న విషయంపై బాబు ప్రయత్నిస్తానని చెప్పి మరీ ఎన్నికలు జరిగే నాటికి అబ్బాయికి కాకుండా.. రాంజీ తండ్రికి సీటు కేటాయించటం..చివరకు ప్రజాతీర్పు ఏమైందన్నది తెలిసిందే.
తనను ఏ మాత్రం పట్టించుకోని చంద్రబాబుకు షాకిచ్చేందుకు రాంజీ సిద్ధమవుతున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో ప్రోత్సాహం కరువవుతోందని.. స్వయంగా మాగంటి బాబునే చంద్రబాబును అడిగినా ఆయన నోటి నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదన్నారు. పార్టీ పదవుల్లోనూ ఎలాంటి అవకాశం ఇవ్వని బాబు తీరుపై రాంజీ గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్న ఆయన.. వచ్చే ఏడాదిలో పార్టీ మారేందుకు పావులు కదుపుతున్నారు.
రాంజీని పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీ మంత్రి ఆళ్ల నాని వర్గంగా గుర్తింపు పొందిన రాంజీ.. ఆయనతో సన్నిహిత సంబంధాల్ని నడుపుతున్నారు. టీడీపీ నుంచి కమ్మసామాజిక వర్గానికి చెందిన వారిని ప్రణాళిక ప్రకారం పార్టీలోకి తీసుకురావటం.. వారికి పదవులు ఇవ్వటం లాంటి విషయంలో జగన్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెబుతున్నారు. ఇలాంటి అంశాలెన్నో.. రాంజీ పార్టీ మారేందుకు దోహదం చేశాయని చెప్పక తప్పదు.