విశాఖ ఉక్కు కేటీఆర్ హక్కు !
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అవును కేటీఆర్ కూడా ఇది అందరి హక్కు అని అంటున్నారు.ఆ రోజు పరిణామాలు ఇవాళ ఏడాదిగా విశాఖ వీధులలో నడయాడుతున్న నిరసనలు వీటిన్నింటిపై కూలంకుషంగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. ఆంధ్రకు మరో పెద్ద దిక్కుగా నిలిచారు.బాసటగా నిలిచారు. పోరు వాక్కు కు ఉన్న ప్రాధాన్యం వివరించి ఆంధ్రుల ప్రేమను మరోసారి అందుకున్నారు.
చాలా రోజుల తరువాత తెలంగాణ అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రస్తావన వచ్చింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను వ్యతిరేకించారు.ఇదే సందర్భంలో బీజేపీ తీరును ఎండగట్టారు.
దీంతో ఆయన మాటలకు ఇటు ఆంధ్రాలోనూ జేజేలు పలుకుతున్నారు సంబంధిత వర్గాలు మరియు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా! ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను హరీశ్ రావు (వైద్య ఆరోగ్య శాఖ మంత్రి) కూడా వ్యతిరేకించారు. అదేవిధంగా కేసీఆర్ కూడా బీజేపీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తూనే ఆంధ్రాకు న్యాయం చేయమని పదే పదే కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ అసెంబ్లీ వాకిట కేటీఆర్ ఇక్కడి ఉద్యమం గురించి,ఇక్కడి ఉద్వేగ సంబంధ నినాదాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో అంతా కలిసి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ఏ విధంగా పరాయి వ్యక్తుల పాలైపోతుందన్న విషయం గురించి కూలంకుషంగా వివరించి మరోసారి ఆంధ్రుల మనసు గెలుచుకున్నారు.
ఇక విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు సంబంధించి టీడీపీ కూడా ఓ మోస్తరు యుద్ధం చేసి ఊరుకుంది. యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తో సహా పలువురు ఉద్యమానికి మద్దతు ఇచ్చినా ఫలితం మాత్రం లేకపోయింది.
విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా కూడా పెద్దగా ఎఫెక్ట్ లేదు. కానీ ఇవాళ పొరుగు రాష్ట్రాన ఉన్న అసెంబ్లీలో మనకు మద్దతుగా కేటీఆర్ గొంతు వినిపించడం, రేపటి వేళ కేంద్రంపై రెండు తెలుగు రాష్ట్రాలూ కలిసి చేసే ఉమ్మడి పోరుకు స్పష్టమయిన సంకేతిక కానుంది.