ఈ చెత్త రికార్డు అంతు చూడాల్సిందే కేసీఆర్

Update: 2020-10-02 11:10 GMT
తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది ఉన్నా.. రాష్ట్రం పట్ల తనకున్నత ప్రేమాభిమానాలు మరెవరికీ లేవన్నట్లుగా చెప్పే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సాటి వచ్చే వారెవరూ ఉండరని చెప్పక తప్పదు. తెలంగాణ కోసం ఆయన తపించినంతగా మరెవరూ లేరన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. తాజాగా రైతులు.. వారి ప్రయోజనాల కోసం దేవుడితో అయినా కోట్లాడతానని చెప్పేసిన కేసీఆర్.. మరికొన్ని విషయాల్లోనూ ఫోకస్ పెట్టాలని చెబుతున్నారు.

తాజాగా జాతీయ నేరాల నమోదు సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో బాలకార్మికుల నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల లెక్కల వివరాల్ని వెల్లడించింది. దీని ప్రకారం దేశంలో అత్యధికంగా బాలకార్మికులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో బాలకార్మికుల కేసులు భారీగా నమోదుకావటం చూస్తే.. ఈ తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని తెలిసేలా చేసింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిలో 314 కేసులు నమోదుకావటం గమనార్హం. దేశ వ్యాప్తంగా 770 కేసులు నమోదైతే.. అందులో అత్యధికం తెలంగాణనే. రాష్ట్రం తర్వాత రెండో స్థానంలో కర్ణాటక.. మూడో స్థానంలో అసోం నిలిచినట్లుగా నివేదిక చెబుతోంది. రైతులు.. వారి ప్రయోజనాల కోసం దేవుడితో అయినా లొల్లికి సిద్ధమని చెప్పే కేసీఆర్ సారు.. రాష్ట్రంలో బాలకార్మికుల వ్యవస్థను కూకటివేళ్లలో పెకిలించే ప్రయత్నాన్ని ఎందుకు చేపట్టకూడదు? దేశంలోనే ఇంత భారీగా బాలకార్మికులు రాష్ట్రంలో ఉన్న వేళ.. అలాంటి చెత్త రికార్డు రాష్ట్రం పేరుతో ఉండటాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకోవాలంటున్నారు. మరి.. సారు ఈ ఇష్యూ మీద ఫోకస్ చేస్తారంటారా?  
Tags:    

Similar News