పవన్ బాబు మాట..జీర్ణించుకోలేకపోతున్నారు..

Update: 2019-01-04 05:41 GMT
పవన్ డోసు సరిపోలేదు.. చంద్రబాబు అండ్ ఆయన అనుకూల మీడియా చేస్తున్న ప్రచారానికి పవన్ ఇచ్చిన కౌంటర్ పనిచేయలేదు. పవన్ తనతో కలిసి రావాలని.. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేద్దామని.. ఇటీవలే చంద్రబాబు విలేకరుల సమావేశంలో బేరం పెట్టారు. దీంతో టీడీపీ అనుకూల మీడియా అనుకూలంగా కథనాలు రాసేసింది. చంద్రబాబు-పవన్ మళ్లీ పొత్తు పెట్టుకుంటారని కలిసి పనిచేస్తారని రాష్ట్రవ్యాప్తంగా మీడియా ద్వారా కోడై కూసింది. పవన్, చంద్రబాబు ఒకటే అన్నట్టు జనంలోకి తీసుకెళ్లారు. ఇక జగన్ మద్దతు దారులు మాత్రం పవన్ పై దుమ్మెత్తిపోశారు. బాబు ఏజెంట్ అంటూ తిట్టిపోశారు.

ఇంత యాగీ జరుగుతున్నా పవన్ మాత్రం సింపుల్ గా తేల్చేశాడు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తానని.. వామపక్షాలు తప్ప అధికార - ప్రతిపక్షాల తో పొత్తు పెట్టుకోబోనని.. ఏపీలోని మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. దీన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు..

అప్పట్లో యాత్రల్లో టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ లపై విరుచుకుపడ్డ పవన్.. ఇప్పుడు జనసేనను కబళించేందుకు పొత్తు డ్రామా ఆడిన బాబును అంత తేలిగ్గా వదిలేయడం ఏంటని లోలోపల మథనపడుతున్నారు. పవన్ ట్విట్టర్ లో స్పందించడం.. ఓ వీడియో విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. అదీ కూడా ఏమంత ఘాటుగా లేదు. 2014 నుంచి బాబు చేసిన మోసం.. తనను వాడుకొని వదిలేసిన వైనం.. జనాలు బాబును ఓడగొట్టాలని ఆ కుట్రలు - కుతంత్రాలు పవన్ బయటపెడుతాడని భావించారు. కానీ పవన్ స్పందన మాత్రం జనసేన నేతలకు నిరాశ కలిగేలా ఉంది.
Read more!

పవన్ ప్రకటన తర్వాతైనా టీడీపీ - దాని అనుకూల మీడియా ఊరుకోవడం లేదు. పవన్ ఒంటరిగా పోటీచేసినా గెలిచాక మోడీకి వ్యతిరేకంగా బాబుతో కలుస్తాడంటూ కొత్త ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కు లోలోపల ఉండబట్టే ఇలా సున్నితంగా స్పందించాడంటూ కొత్త నిర్వచనాలు చెబుతున్నారు. దీంతో జనసేన -టీడీపీ పొత్తు వదంతులు తగ్గడం లేదు. పవన్ ఘాటుగా స్పందించి బాబు కుట్రలను తుత్తునియలు చేయాలని జనసైనికులు - అభిమానులు కోరుతున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.


Full View
Tags:    

Similar News