పాక్ ను కిందకు లాగేసిన కోహ్లీ సేన!
కొత్త బిచ్చగాడు పొద్దెరగడని సామెత... ఈ సామెత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం సంపాదించిన పాక్ కు కరెక్టుగా బాగా వర్తిస్తుంది. క్రికెట్ లో ర్యాంకింగ్స్ ఏమాత్రం శాస్వతం కాదని, వాటిని కాపాడుకోవడం అంటే మరీ కష్టమనీ తెలిసిన మూర్ఖత్వమో, తెలియని తింగరితనమో కానీ పాక్ చరిత్రలో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ రాగానే ఆ దేశ అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదే ర్యాంక్ ఏ దేశానికైనా లేక భారత్ కైనా వచ్చి ఉంటే సంబరాలు చేసుకుంటారు. కానీ, వచ్చింది పాక్ కి కావడంతో వారంతా భారత్ క్రికెట్ అభిమానులను కవ్వించారు. వెటకారమాడుతూ, రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో రకరకాల కవ్వించేలా విమర్శలు చేశారు. అయితే ఆ అనందం నాలుగు రోజులుండకుండానే భారత్ సింగిల్ హ్యాండ్ తో ఆ స్థానాన్ని లాగేసింది.
న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్, ఈ గెలుపుతో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. కోల్ కతాలో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన 178 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీస్ తో పాటు పాకిస్థాన్ వద్ద ఉన్న నెంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పటివరకూ అగ్ర స్థానంలో ఉన్న పాక్ రెండో స్థానానికి పడిపోయింది. అయితే టీం ఇండియా గనుక న్యూజిలాండ్ తో జరగనున్న మూడో టెస్ట్ ను డ్రా చేసినా - గెలిచినా ఇక అగ్రస్థానానికి తిరిగి చేరుకోవడం పాక్ కు కష్టమే. పైగా 2017 మార్చి వరకూ టీం ఇండియాకు టెస్టు సీరిస్ లు వరుసగా ఉన్నాయి. దీంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం భారత్ కు పుష్కలంగా ఉంది.
కాగా, ప్రస్తుతం భారత్ - పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించడం అభిమానులకు మరింత సంతోషం కలిగిస్తోంది. న్యూజిలాండ్ తో టెస్ట్ మ్యాచ్ గెలవడం సంగతి పక్కన పెడితే... పాకిస్థాన్ నుంచి ఫస్ట్ ర్యాంకును లాగేసుకోవడం, తానే ఆ కుర్చీలో కుర్చోవడంతో భారత అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/