నాకు పెళ్లి కూతురు కావాలి ...నా వయుస్సు కేవలం 63 ఏళ్లు !
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అలాగే ఈ పెళ్లి పై ప్రతి ఒక్కరిలోనూ కొన్ని కలలు, ఆశలు ఉంటాయి. కానీ , నేటి యువత మాత్రం మూడు ముళ్ల గురించి మూడు పదులు దాటే వరకు ఆలోచించడమే లేదు. కెరీర్ కోసం పెళ్లికి దూరంగా ఉండేవారు కొందరైతే.. అమ్మాయిలు దొరకక మరి కొంతమంది పెళ్ళికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి గతం లో అబ్బాయిల కోసం అమ్మాయిల తల్లిదండ్రులు ఆపసోపాలు పడి వెతికే వారు. కానీ, నేడు అమ్మాయిల కోసం అబ్బాయిల తల్లిదండ్రులు అన్వేషణ చేస్తున్నారు.
ఇక విచిత్రం ఏమిటంటే ... ఏకంగా మరి కొంతమంది అయితే అమ్మా యిలకే ఎదురు కట్నం వచ్చి వివాహం చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సమస్యే ఓ వ్యక్తి ఎదురైంది. ప్రస్తుతం ఆయన ఏజ్ జస్ట్ 63. అయినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలా వధువు కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పంచాయితీ ఆఫీసు కు తనకు వధువు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే..ఆశ్చర్య పోవడం అక్కడ సిబ్బంది వంతైయ్యింది.
ఒక వ్యక్తి తనకి కావాల్సిన వధువు కోసం వెతికి, వెతికి కాళ్లు అరిగి పోయాయి. ఒళ్లు హూనమై పోయింది. ఆ వెతుకులాటలోనే 40 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇంక ఎలాగూ మిగిలింది వృద్దాప్యమే కాబట్టి కృష్ణా, రామా అంటూ కాలం వెళ్లదీయాలి. కానీ,ఈ ఏజ్ లో తనకి వధువు కావాలని అర్జీ పెట్టుకోవడంతో ఈ వార్త విన్న వారందరు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఈ సంఘటన హవేరి జిల్లాలోని హంగల్ తాలూకాలోని నరేగల్ గ్రామం లో జరిగింది. హౌసింగ్ స్కీమ్ కింద నివాసాలకు, ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలకు దరఖాస్తులు తీసుకునే పంచాయతీ అధికారులకు, వృద్ధుడికి వధువు ను కనుగొనడానికి ఒక అభ్యర్థన ను అందుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈయన ఇచ్చిన దరఖాస్తు లో.. ధ్యామన్న కమ్మర్ తన సొంత కులానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కోరాడు.
అతను దయామవ మందిరానికి పూజారి అని, అవివాహితుడనని, తగిన అమ్మాయి కోసం ఇప్పటివరకు చేసిన అన్వేషణ విఫలమైందని చెప్పాడు. నాకు ఆహారం వండడానికి ఎవరూ లేరు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా పెళ్ళికి మీరు ఒక అమ్మాయిని వెతకాలి అని ఆయన దరఖాస్తులో పేర్కొన్నారు. అధ్యక్షుడు, పంచాయతీ అభివృద్ధి అధికారి దైమన్న దరఖాస్తును స్వీకరించి రసీదు ఇచ్చారు. కొంతమంది గ్రామ పంచాయతీ సభ్యులు కూడా ధ్యామన్న దరఖాస్తుపై సంతకం చేసి మద్దతు ఇచ్చారు. . మరి ఈ 63 ఏళ్ల ఓల్డ్ వరుడికి వధువు దొరుకుతుందో.. లేదో..వేచి చూడాలి.