జీహెచ్ ఎంసీపై హైకోర్టు సీరియ‌స్‌.. ఎందుకిలా జరుగుతోంది..?

Update: 2021-02-12 10:53 GMT
గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొష‌న్ పై రాష్ట్ర హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. పాద‌చారులు న‌డ‌వాల్సిన ఫుట్ పాత్ లు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురువుతున్నా ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదంటూ ధ‌ర్మాస‌నం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని నిల‌దీసింది. ఫుట్‌పాత్ ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించిన న్యాయ‌స్థానం.. గతంలో ఈ విష‌యమై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

ఫుట్ పాత్ ఆక్ర‌మ‌ణ‌ల‌పై దాఖ‌లైన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని విచారించిన న్యాయ‌స్థానం పై విధంగా ఆదేశించింది. ఫుట్ పాత్ ల ఆక్ర‌మ‌ణ‌ల‌తో పాదాచారులు రోడ్లపై నడుస్తున్నారని, దాంతో రోడ్డు ప్రమాదాలు జ‌రిగి ప్రాణాలు పోతున్నాయ‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం ఫుట్‌పాత్ లు నిర్మించాల‌ని కోరినా.. జీహెచ్ఎంసీ పట్టించుకోవడం లేద‌ని వాజ్యంలో పేర్కొన్నారు.

రోడ్ల విస్తరణలో భాగంగా ఫుట్‌పాత్‌లు తొలగిస్తున్నారని పేర్కొన్న‌ పిటిష‌న‌ర్‌.. ఆ త‌ర్వాత వాటిని పునుద్ధ‌రించ‌ట్లేద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు. గ‌తంలో 10 ఫీట్ల వెడల్పుతో ఉన్న ఫుట్‌పాత్‌లు.. ఇప్పుడు 5 ఫీట్లకు త‌గ్గిపోయాయ‌ని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.
Tags:    

Similar News