ఇక గూగుల్ క్రిడెట్ కార్డ్స్.. త్వరపడండి

Update: 2019-09-20 11:15 GMT
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పటికే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టి ప్రవేశపెట్టిన ‘గూగుల్ పే’ ఎంతో హిట్ అయిన సంగతి తెలిసిందే..  అనతికాలంలోనే ఇది దేశంలోనే అతిపెద్ద పేమంట్ యాప్ గా అవతరించింది. అదే ఊపులో ఇప్పుడు గూగుల్ త్వరలోనే ‘క్రెడిట్ కార్డు’లను  వినియోగదారులకు అందజేయడానికి సిద్ధమైంది.

తాజాగా రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ‘గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఈ క్రెడిట్ కార్డులను తీసుకురాబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది. రెండు రకాలుగా ఒకటి టోకనైజ్డ్ , ఇంకో స్పాట్ ఫ్లాట్ ఫాం కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది.

ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వీలుగానే గూగుల్ ఈ కొత్త టెక్నాలజీతో ‘టోకనైజ్డ్ ’ కార్డుల పేరిట క్రెడిట్ కార్డులను తీసుకొస్తోంది. దీని ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలేవీ ఇవ్వకుండానే గూగుల్ పే ద్వారా చెల్లింపులు జరుపుకోవచ్చు. ఆన్ లైన్ మోసాలకు ప్రధాన కారణమైన సీవీవీ నంబర్ - కార్డ్ నంబర్లు ఇవ్వాల్సిన అవసరం గూగుల్ కార్డ్స్ ను తీర్చిదిద్దడం విశేషం.

గూగుల్ కార్డ్స్ ప్రధానంగా ఆన్ లైన్ మోసాలకు చెక్ చెప్పడానికే తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఇది వస్తే ఓ విప్లమాత్మక మార్పుగా మార్కెట్ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

Tags:    

Similar News