'73 రోజుల్లో వ్యాక్సిన్'.. ఉత్త ఫేక్ వార్తేనట!
కరోనా వ్యాక్సిన్ మీద ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆసక్తిని అలుసుగా తీసుకొని తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. వాట్సాప్ లలోనూ.. సోషల్ మీడియాలోనూ వైరల్ చేయటం.. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు చోటు చేసుకోటం తెలిసిందే. ఇదేతీరులో వినాయకచవితి పండుగ వేళ.. ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి వైరల్ గా మారింది. దేశీయంగా 73 రోజుల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెలిపినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
దీనిపై తాజాగా ఆ సంస్థ స్పందించింది. తాము 73 రోజుల్లో వ్యాక్సిన్ తీసుకోస్తామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఈ వార్తలన్ని ఊహాజనితం.. అసత్యాలు’ అంటూ తేల్చేసింది. వ్యాక్సిన్ తయారు చేసి భవిష్యత్తు అవసరాల కోసం దానిని నిల్వ చేయటానికి మాత్రమే తాముఅనుమతి పొందామని..వ్యాక్సిన్ ను బయటకు విడుదల చేయటానికి తమకు ఎలాంటి అనుమతులు రాలేదని పేర్కొంది. అదే సమయంలో.. వ్యాక్సిన్ విడుదల ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. గతంలో ఇదే సంస్థ.. వ్యాక్సిన్ 2021 మధ్య నాటికి వస్తుందని చెబుతున్నారు.
సీరమ్ సంస్థ.. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం డెవలప్ చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను 100 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి అమ్మేందుకు ఎస్ఐఐ బ్రిటన్ కుచెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వాటి ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా ఎస్ఐఐ గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల మూలధనాన్ని పొందనుంది. ఈ వివరాల్ని ఇలా ఉంటే.. కోవిషీల్డ్ పేరుతో 73 రోజుల్లో వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందన్న ఊరింపు మాటలన్ని ఉత్తవేనన్న విషయం తేలటం.. చాలామందిని నిరాశకు గురి చేసిందని చెప్పక తప్పదు.