కరోనా ఎఫెక్ట్​ ​.. భార్యలు విడాకులిస్తున్నారు.. గర్ల్ ఫ్రెండ్స్​ బ్రేకప్​ చెప్తున్నారు..!

Update: 2020-12-11 04:15 GMT
కరోనా సంక్షోభంతో అన్నిరంగాలు కుదేలయ్యాయి. చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఉపాధి కోల్పోయారు. అయితే కరోనాతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విడాకులు తీసుకొనే వారిసంఖ్య కూడా పెరిగిందట. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విడాకుల కేసులు పెరిగాయని సర్వేసంస్థలు తేల్చిచెబుతున్నాయి. లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉండి పోవడం, మహిళల పై పనిభారం పెరగడంతో వాళ్లు విడాకుల వైపే మొగ్గు చూపుతున్నారట.  

రిలేషన్​ షిప్​ లో ఉన్న చాలా మంది అమ్మాయిలు తమ బాయ్​ ఫ్రెండ్స్ ​కు బ్రేకప్​ చెప్పేశారట. విడాకులు తీసుకున్న వారిసంఖ్య బ్రిటన్​తోపాటు మిగతా దేశాల్లోనూ ఎక్కువగానే ఉన్నదని సర్వేలు చెబుతున్నాయి. కేవలం గత జూలై నుంచి అక్టోబర్​ వరకు బ్రిటన్​ లో విడాకులు తీసుకొనే వారి సంఖ్య 122 శాతానికి పెరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా బ్రిటన్​కు చెందిన న్యాయసేవాసంస్థ స్టువార్డ్స్​ వెల్లడించింది. చారిటీ సిటిజన్స్ అడ్వైజ్ అనే సంస్థ బ్రిటన్​లో బ్రేకప్​ తీసుకొనేవారిపై ఓ సర్వే నిర్వహించింది. అమెరికాలోనూ విడాకులు తీసుకొనేవారిసంఖ్య దాదాపు 34 శాతం పెరిగినట్టు సమాచారం. చైనా, స్వీడన్​ లాంటి దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.

చాలామంది మహిళలకు లాక్​డౌన్​తో ఇంటిపని పెరిగింది. మరోవైపు ఇంట్లోనే ఉండిపోవడంతో వాళ్లు తీవ్ర మానసికక్షోభకు గురయ్యారు. విడాకులు తీసుకోవడానికి ఇది కూడా ఓ కారణం అని చెబుతున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా మహిళలే ఎక్కువ గా విడాకులు కోరినట్టు సమాచారం. బ్రేకప్​లు, విడాకులు తీసుకోవాడానికి ఆర్థిక స్థితిగతులు కూడా ఓ కారణమే. చాలా కంపెనీలు తమ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించాయి. దీంతో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో తెలయక భార్యభర్తలు తీవ్రంగా సతమతమయ్యారు. ఈ విషయంపై గొడవలు చెలరేగాయి. దీంతో చాలా మంది భాగస్వాములతో ఉండలేక విడాకులు తీసుకుంటున్నారట.
Tags:    

Similar News