టీకా తీసుకున్నాక ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా ఛాన్స్

Update: 2020-12-11 03:41 GMT
బ్రిటన్.. దుబాయ్ లాంటి కొన్ని దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ వచ్చేసిందనగానే కొందరు గుండెల మీద నుంచి టన్నుల బరువు దిగిపోయినట్లుగా ఫీల్ అవుతున్నారు. కానీ.. టీకాకు ఉన్న పరిమితులు.. టీకా వేయించుకున్న తర్వాత ఫాలో కావాల్సిన అంశాల్ని తెలుసుకున్న తర్వాత.. అసలు టీకా అవసరం ఉందంటారా? అన్న భావన కలుగుతుందని అంటున్నారు. ఎందుకంటే.. టీకా తర్వాత మాస్కు ధరించటం.. భౌతికదూరాన్ని పక్కాగా ఫాలో కావటం.. కరోనా నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు.

అదేమిటంటారా? అందుకు కారణాలు లేకపోలేదు. కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారు చేసినప్పటికి కీలక అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది టీకా రెండు సార్లు వేయించుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య కనీసం వారం.. పది రోజుల తేడా ఉంటుంది. ఒక్కో టీకాకు ఒక్కోలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి.

ఫైజర్ టీకా అయితే రెండు వారాల గ్యాప్ తో రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.అదే.. మొడెర్నా అయితే నాలుగు వారాల టైం ఉంటుంది. ఈ కారణంగా టీకా తీసుకున్నంతనే రోగ నిరోధక శక్తి రాదని..  అందుకు కనీసం రెండు వారాల టైం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీకా వేసుకున్న తర్వాత రెండు వారాల పాటు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు.

వ్యాక్సిన్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తుందా? లేక.. లక్షణాలు కనిపించకుండా చేస్తుందా? అన్న విషయంపై స్పష్టత లేదన్న మాట వినిపిస్తోంది. ఇదంతా చదివిన తర్వాత.. కరోనా టీకా వేయించుకోవాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్న తలెత్తక మానదు. చూస్తుంటే.. టీకాల పని తీరు మీద ఇప్పటికే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పుడేమో టీకా పని చేయాలంటే ఉన్న పరిమితులు చూస్తే.. టీకా వల్ల అసలు ప్రయోజనం ఉందా? అన్న కన్ఫ్యూజన్ కు గురి కాక మానరు.
Tags:    

Similar News